Uppena Movie: డిజిటల్ స్ట్రీమింగ్‌‌‌కు సిద్దమైన సూపర్ హిట్ ప్రేమకథ.. ఓటీటీలోకి ‘ఉప్పెన’ సినిమా.. ఎప్పుడంటే..

Uppena Movie: టాలీవుడ్ లో ఇప్పటికే చాలా ప్రేమ కథలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఈ మధ్యకాలంలో భారీ ప్రేక్షకాదరణ పొందిన ప్రేమ కథ చిత్రం సినిమా ఏదైనా ఉంది అంటే అది ఉప్పెన అనే చెప్పాలి.

Uppena Movie: డిజిటల్ స్ట్రీమింగ్‌‌‌కు సిద్దమైన సూపర్ హిట్ ప్రేమకథ.. ఓటీటీలోకి ఉప్పెన సినిమా.. ఎప్పుడంటే..
Uppena

Edited By:

Updated on: Apr 12, 2021 | 7:40 PM

Uppena Movie: టాలీవుడ్ లో ఇప్పటికే చాలా ప్రేమ కథలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఈ మధ్యకాలంలో భారీ ప్రేక్షకాదరణ పొందిన ప్రేమ కథ చిత్రం ఏదైనా ఉంది అంటే అది ‘ఉప్పెన’ అనే చెప్పాలి. బుచ్చి బాబు సాన దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఈ సూపర్ హిట్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా.. డైరెక్టర్ సుకుమార్ సమర్పకుడిగా వ్యవహరించారు. అలాగే ఉప్పెనలో బెంగుళూరు భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే ఈ అమ్మడు కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారిపోయింది. అలాగే తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించి మెప్పించారు. ప్రతినాయకుడిగా రాయనం పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాకుండా.. పలు రికార్డులను కూడా క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఉప్పెన సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కథను , సినిమాలోని ఫీల్ ను వేరే లెవల్ కు తీసుకెళ్లింది. ముఖ్యంగా ఈ సినిమాలో నీకన్ను నీలి సముద్రం అనే పాట యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. ప్రముఖ ఛానల్ లో ఉప్పెనను ఏప్రిల్ 18న ప్రసారం చేయనున్నారు. అంతకంటే నాలుగు రోజుల ముందుగా అంటే ఏప్రిల్ 14న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఉప్పెన సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది. థియేటర్స్ లో విడుదలై బ్రహ్మాండమైన విజయాన్ని అందుకున్న ఉప్పెన.. ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sunny Leone: ‘పదమూడేళ్ల అనుబంధం.. పదేళ్ల వివాహ జీవితం’… ఎమోషనల్‌ పోస్ట్‌ చేసిన సన్నీ లియోన్‌..

వకీల్ సాబ్ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు..? ‘ఐకాన్’ కోసం ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ అభిమానులు..

‘దేశాన్ని ప్రేమించటం అందరి పని. వాళ్లని కాపాడటం సోల్జర్‌ పని’.. ఆకట్టుకుంటున్న ‘మేజర్’ టీజర్..

Loading...
Unable to load recommendations.
Follow Us