అచ్చం మామ పొలికే.. ఉదయ్ కిరణ్ మేనకోడలు ఇప్పుడు ఎలా ఉందొ చూశారా..

ఒకప్పుడు తెలుగు సినీరంగంలో లవర్ బాయ్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఉదయ్ కిరణ్. కెరీర్ మొదట్లోనే వరుస హిట్లతో తెలుగు చిత్రపరిశ్రమను ఓ ఊపు ఊపేశాడు. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఇండస్ట్రీలో సునామీల దూసుకొచ్చాడు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఓ సాధారణ కుర్రాడు అప్పట్లోనే అమ్మాయిల డ్రీమ్ హీరోగా మారిపోయాడు.

అచ్చం మామ పొలికే.. ఉదయ్ కిరణ్ మేనకోడలు ఇప్పుడు ఎలా ఉందొ చూశారా..
Uday Kiran

Updated on: Feb 11, 2026 | 10:57 AM

ఉదయ్ కిరణ్.. ఈ పేరు వినగానే మనసులోకి తెలియని బాధ వచ్చేస్తుంది, కళ్లు చమరుస్తాయి. లవర్ బాయ్ గా ఇమేజ్ సొంతం చేసున్న ఉదయ్.. తక్కువ సమయంలోనే స్టార్ గా మారిపోయాడు. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలతో వరుసగా విజయాలను అందుకొని తెలుగు తెరపై హీరోగా తనదైన ముద్ర వేశాడు. స్టార్ హీరోగా ఎదుగుతాడు అనుకునే తరుణంలో ఎవరూ ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఉదయ్ కిరణ్ నటించిన ఈ అందమైన ప్రేమకథ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ చిత్రానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా 2001లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో ఉదయ్ కిరణ్ సరసన రీమా సేన్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.

ఇక ఆర్పీ పట్నాయక్ అందించిన మ్యూజిక్ సినిమాకు మరో హైలెట్. ఈ చిత్రంలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి.  ఇప్పటికీ చాలా మంది ఫెవరేట్ సినిమా ఇది. ఎప్పుడు టీవీలో వచ్చిన కదలకుండా సినిమా చూస్తారు ఆడియన్స్. అలాంటి క్లాసిక్ సినిమా ఇప్పుడు తిరిగి మరోసారి థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతుంది. ఈ ప్రేమికుల రోజున ఫిబ్రవరి 14న థియేటర్స్ లో రీ రిలీజ్ అవుతుంది మనసంతా నువ్వే సినిమా.

మనసంతా నువ్వే రీ రిలీజ్ కానుండటంతో ఉదయ్ అభిమానులు, ప్రేక్షకులు మరోసారి ఈ సినిమాను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నారు. తాజాగా ఉదయ్ కిరణ్ మేనకోడలు ఓ వీడియో బైట్ ను షేర్ చేసింది. మనసంతా నువ్వే సినిమా మరోసారి అలరించడానికి రెడీ అవుతుంది. ఆ సినిమా విడుదలైనప్పుడు నేను 2 నెలల పాపను. ఇప్పుడు మనసంతా నువ్వే సినిమాను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి అంటూ వీడియోను షేర్ చేసింది. అయితే ఈ వీడియోలో ఉదయ్ కిరణ్ మేనకోడలు మహతిని చూసి అభిమానులు అవాక్ అవుతున్నారు. ఆమె అచ్చం తన మామ ఉదయ్ కిరణ్ లానే ఉంది. ఈ చిన్నదాని వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.