Actress Haritha: తన సీరియల్ పేరుతోనే.. కొత్త బిజినెస్ ప్రారంభించిన బుల్లితెర నటి హరిత.. మహిళల కోసమే స్పెషల్‌గా..

ఇటీవల కాలంలో సినిమా, టీవీసెలబ్రిటీలందరూ కూడా బిజినెస్ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఓ వైపు సినిమాలు, సీరియల్స్ చేస్తూనే మరోవైపు వ్యాపారంలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా సీరియల్ నటి హరిత కూడా బిజినెస్ ప్రారంభించారు. అది కూడా తనకెంతో గుర్తింపు తీసుకొచ్చిన ముద్ద మందారం సీరియల్ పేరుతో..

Actress Haritha: తన సీరియల్ పేరుతోనే.. కొత్త బిజినెస్ ప్రారంభించిన బుల్లితెర నటి హరిత.. మహిళల కోసమే స్పెషల్‌గా..
Actress Haritha

Updated on: Oct 16, 2026 | 11:05 AM

టీవీ సీరియల్స్ బాగా చూసే వారికి నటి హరిత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా ఆమె నటించిన ముద్దమందారం సీరియల్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో హరిత పోషించిన అఖిలాండేశ్వరిగా పాత్ర ఇప్పటికీ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. అంతకు ముందు కుంకుమపువ్వు, ముద్దమందారం, ఋతురాగాలు, కళ్యాణం కమనీయం వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హరిత. అలాగే కొన్ని సినిమాల్లోనూ నటించారీ అందాల తార. ప్రస్తుతం జానకి పరిణయం సీరియల్స్ లో నటిస్తోన్న ఆమె ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారు. తాజాగా బిజినెస్ రంగంలోకి కూడా ఆమె అడుగు పెట్టడం విశేషం. తనకెంతో బాగా గుర్తింపు తెచ్చిన సీరియల్ ‘ముద్ద మందారం’ పేరుతో క్లాతింగ్ బిజినెస్ ప్రారంభించారామె. నేపథ్యంలోనే తన కొత్త బిజినెస్ కి సంబంధించిన వివరాలను హరిత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు హరిత.

ముద్దమందారం వస్త్ర నిలయం పేరుతో చీరల వ్యాపారాన్ని ప్రారంభించారు హరిత. హైదరాబాద్ నార్సింగ్ ఏరియాలో ఈ స్టోర్ ప్రారంభించినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారామె. కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఈ స్టోర్ ఓపెనింగ్ కు వచ్చారు. హరిత- జాకీ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.  ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ‘ప్రతి చీర ఒక కథ చెబుతుంది.. ప్రతి సాంప్రదాయం ఒక జ్ఞాపకంగా మారుతుంది.. మీ అందరి దీవెనలు కావాలి’ అంటూ ముద్దమందారం వస్త్ర నిలయం గురించి ఈమె షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు హరితకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆమె బిజినెస్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మెసేజులు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ముద్ద మందారం వస్త్రనిలయం ప్రారంభోత్సవంలో హరిత- జాకీ దంపతులు..

కాగా హరిత భర్త జాకీ కూడా ప్రముఖ నటుడన్న సంగతి అందరికీ తెలిసిందే. పలు సినిమాల్లో సహాయక నటుడిగా మెప్పించిన ఆయన ఇప్పుడు బుల్లితెరపై బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు.

భర్త జాకీతో హరిత..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us