Trisha: మేడం సార్.. మేడం అంతే.. త్రిష మరో ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారా..?

సౌత్ సినీ ఇండస్ట్రీలో ఇటీవల త్రిష పేరు మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం వైరల్ కావడంతో అభిమానులు ఆందోళన చెందగా, అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని త్రిష స్పష్టం చేశారు. తన పూర్తి దృష్టి ఇప్పటికీ సినిమాలపైనే ఉందని చెప్పడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

Trisha: మేడం సార్.. మేడం అంతే.. త్రిష మరో ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారా..?
Trisha

Edited By:

Updated on: May 20, 2026 | 5:52 PM

రీసెంట్ టైమ్స్‌లో సౌత్ సినీ ఇండస్ట్రీలో త్రిష పేరు బాగా ట్రెండ్ అవుతోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా తమ మార్క్‌ యాక్టింగ్, గ్లామర్ తో ప్రేక్షకులను అలరిస్తున్న త్రిష, మధ్యలో చిన్న బ్రేక్‌ తీసుకున్నారు. ఒక దశలో త్రిష ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసి, పొలిటికల్ ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం కూడా గట్టిగానే జరిగింది. ఆ వార్తలు వైరల్ కావటంతో ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. సోషల్ మీడియాలో ఈ బజ్ పీక్స్ కు వెళ్ళింది. అయితే, అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని, తన ఫోకస్ ఎప్పుడూ సినిమాలపైనే ఉంటుందని త్రిష క్లారిటీ ఇవ్వటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

సరిగ్గా ఇలాంటి అంచనాలు, ఊహాగానాల మధ్య త్రిష ‘కరుప్పు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ తమిళ బాక్సాఫీస్ దగ్గర బాగానే సందడి చేస్తోంది. దీంతో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. త్రిష కెరీర్ ముగిసిపోయింది అనుకున్న క్రిటిక్స్ సైతం.. ఆమె లక్‌ చూసి వావ్‌ అంటున్నారు. ఈ హిట్ తో త్రిష మళ్లీ పాత రోజుల్లా బిజీ అవుతారా లేదా ఆచితూచి అడుగులు వేస్తూ పరిమితంగా సినిమాలు చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఒకవేళ త్రిష నిజంగానే సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటే, ఆ స్థానాన్ని ఎవరు క్యాప్చర్‌ చేస్తారు అన్నది రీసెంట్‌ టైమ్స్ లో జరుగుతున్న ఇంట్రస్టింగ్‌ డిస్కషన్‌. ఇండస్ట్రీలో చాలా మంది కొత్త హీరోయిన్లు వస్తున్నా, సీనియర్ స్టార్స్ కు ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ ను రీచ్ అవ్వడం అంత సులువు కాదు. ఈ రేసులో తమన్నా, కాజల్ అగర్వాల్ లాంటి బ్యూటీస్‌ ముందు వరుసలో ఉన్నారు. అయితే, వీళ్లు కూడా ఈ మధ్య కాలంలో కమర్షియల్ హిట్స్ విషయంలో కాస్త వెనుకబడ్డారు. తమన్నాకు అవకాశాలు వస్తున్నా, సోలోగా ఫీమేల్‌ సెంట్రిక్‌ సినిమాను నిలబెట్టే విషయంలో తడబడుతున్నారు. కాజల్ అగర్వాల్ ఆ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినా, ఇంకా అనుకున్నంత బజ్ క్రియేట్ చేయలేకపోతున్నారు. కాబట్టి త్రిష ప్లేస్ ను వీరు పూర్తిగా ఫిల్ చేస్తారా లేదా అన్నది అనుమానమే.

ఒకవేళ త్రిష గ్యాప్ తీసుకుంటే, ఆ మార్కెట్ ను నయనతారే పూర్తిగా క్యాప్చర్ చేస్తారా అన్న చర్చ కూడా ఇండస్ట్రీలో నడుస్తోంది. ఇప్పటికే నయనతార మార్కెట్ వేరే లెవెల్ లో ఉంది. ఆమె నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతున్నాయి. దీంతో నయనతార పూర్తి స్థాయిలో మార్కెట్‌ను రూల్ చేసే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. కానీ అన్నీ సార్లు ఈ లెక్కలు నిజమవుతాయని అనుకోవడానికి లేదు. ఏదేమైనా ‘కరుప్పు’తో కోలీవుడ్‌లో వచ్చిన ఈ బూస్ట్ ను త్రిష ఎలా వాడుకుంటారో చూడాలి.

Follow Us