బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్‏ను మెప్పించిన టాలీవుడ్ యంగ్ హీరో.. ఆ ఇద్దరి కాంబినేషన్‏లో త్వరలోనే సినిమా ? 

ఆర్‌ఎక్స్‌ 100 అనే సినిమా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్‌ హీరో కార్తికేయ. ఆ ఒక్క మూవీతో కార్తీ లక్షణాది మంది అభిమానులకు సంపాదించుకున్నాడు.

  • Rajitha Chanti
  • Publish Date - 9:04 am, Wed, 24 February 21
బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్‏ను మెప్పించిన టాలీవుడ్ యంగ్ హీరో.. ఆ ఇద్దరి కాంబినేషన్‏లో త్వరలోనే సినిమా ? 

ఆర్‌ఎక్స్‌ 100 అనే సినిమా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్‌ హీరో కార్తికేయ. ఆ ఒక్క మూవీతో కార్తీ లక్షణాది మంది అభిమానులకు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఆ సినిమాతో నిర్మాతగానూ మంచి విజయం అందుకున్నాడు కార్తికేయ. ఆ తర్వాత హిప్పీ, గుణ369, 90ఎంఎల్ సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పాటు చేసుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా.. నాని హీరోగా తెరకెక్కిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో విలన్‌గా కూడా మెప్పించాడు. ప్రస్తుతం కార్తీకేయ తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న వాలిమై సినిమాలో విలన్ క్యారెక్టర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ సీనియర్ హీరో బోనీ కపూర్ నిర్మిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ యంగ్ హీరో.. బాలీవుడ్ సీనియర్ హీరో కమ్ ప్రోడ్యూసర్ బోనీ కపూర్‏కు తెగ నచ్చేశాడట. దీంతో సౌత్ ఇండస్ట్రీలో బోనీ కపూర్ తాను నిర్మించే తదుపరి సినిమాను కార్తీకేయతో తీయాలనుకుంటున్నట్లుగా సమాచారం. ఇదే గనుక జరిగితే.. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఆఫర్లతో జోరుమీదున్న కార్తీకేయ వెనుదిరిగిన చూడాల్సిన అవసరం ఉండదు.

Also Read:

Emraan Hashmi: బాలీవుడ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరో ఇమ్రాన్ హాష్మీ.. ఏమన్నాడో తెలుసా..