
దర్శకుడు వి.ఎన్. ఆదిత్య తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలోని ఎన్నో కీలక విషయాలను, ఎదుగుదలకు కారణమైన అనుభవాలను ఓ ఒక ఇంటర్వ్యూలో వివరించారు. ఆయన మాట్లాడుతూ.. “నేను ఏదీ తేలికగా తీసుకోను. నేను చాలా నిజాయితీగా, భావోద్వేగంగా ఉంటాను. నా మార్గంలో వచ్చే ప్రతిదానికీ కట్టుబడి ఉంటాను” అంటూ తన వ్యక్తిత్వాన్ని, వృత్తి పట్ల అంకితభావాన్ని స్పష్టం చేశారు. వ్యక్తుల మధ్య వైరం అనవసరం అని, పరిస్థితుల ప్రభావం వల్లనే చాలా సమస్యలు తలెత్తుతాయని ఆయన అన్నారు. బ్లేమ్ గేమ్‌కు తాను వ్యతిరేకమని, ఎదుటివారి చెప్పుల్లో ఉండి ఆలోచించే తత్త్వం తనదని పేర్కొన్నారు. చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు.
కెమెరామెన్‌తో తాను పనిచేస్తుండగా, క్లైమాక్స్ తీసేసి డైరెక్టర్‌ను తీసేద్దాం అని ఒక నిర్మాత అన్నారని, ఈ విషయం లంచ్ బ్రేక్‌లో కెమెరామెన్ ద్వారా తనకు తెలిసిందని చెప్పారు. ఆ అవమానాన్ని భరించలేక తాను ఆ సినిమా నుంచి బయటకి వచ్చేశానని ఆదిత్య తెలిపారు. తరుణ్ మంచి నటుడని, అతనిపై గౌరవంతో తరుణ్‌కు ఈ విషయం చెప్పానని, తాను అడిగాను కాబట్టే తరుణ్ ఆ సినిమా క్లైమాక్స్ వెంటనే చేయకుండా వేచి చూశాడని వివరించారు. రెమ్యునరేషన్ కూడా అడగకుండా తాను ఆ సినిమా చేశానని, పైగా బ్యాంకాక్ షూటింగ్ కోసం రూ. 12 లక్షలు వడ్డీకి తెచ్చి తానే సమకూర్చానని వెల్లడించారు.
ఆ తర్వాత ఆ నిర్మాత ఆ డబ్బు సెటిల్ చేశారని, అయితే అండర్ ప్రొడక్షన్‌లో తనకు కేవలం రూ. 3 లక్షలు మాత్రమే వచ్చాయని, అది తన అసోసియేట్ డైరెక్టర్ రెమ్యునరేషన్ కంటే తక్కువ అని తెలిపారు. ఆ రోజుల్లో రెయిన్‌బో సినిమా కోసం రూ. 3 కోట్ల 60 లక్షలు పోగొట్టుకున్నానని ఆదిత్య వెల్లడించారు. “అది అప్పుడు చాలా పెద్ద మొత్తం. ఇప్పుడు కూడా పెద్ద మొత్తమే. కానీ అప్పట్లో అది భారీ నష్టం” అని పేర్కొన్నారు. తన జీవితంలో ముందుకు సాగడానికి ఈ ఆత్మవిశ్వాసం, స్పష్టమైన ఆలోచనలు సహాయపడ్డాయని ఆదిత్య చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.