Prabhas Sreenu: ప్రభాస్ కాదు.. ఆ స్టార్ హీరో చెప్పాకే తాగుడు మానేశాను.. ఆసక్తికర విషయం పంచుకున్న టాలీవుడ్ నటుడు

టాలీవుడ్ నటుడు ప్రభాస్ శ్రీను గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వందల సినిమాల్లో కమెడియన్ గా, సహాయక నటుడిగా నటించి మెప్పించారాయన. అయితే గతంలోలా ఇప్పుడు ఆయన ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. అప్పుడుప్పుడు మాత్రమే వెండితెర, బుల్లితెరపై కనిపించి ఆడియెన్స్ ను నవ్విస్తున్నాడు.

Prabhas Sreenu: ప్రభాస్ కాదు.. ఆ స్టార్ హీరో చెప్పాకే తాగుడు మానేశాను.. ఆసక్తికర విషయం పంచుకున్న టాలీవుడ్ నటుడు
Tollywood Actor Prabhas Sreenu

Updated on: Nov 02, 2026 | 7:20 PM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి టైమింగ్ ఉన్న కమెడియన్లలో ప్రభాస్ శ్రీను ఒకరు. ముఖ్యంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న హాస్య పాత్రలతో తెలుగు ఆడియెన్స్ ను గిలిగింతలు పెట్టారీ నటుడు. సుమారు 150 కు పైగా తెలుగు సినిమాల్లో నటించిన ప్రభాస్ శ్రీను.. డార్లింగ్ ప్రభాస్ కు క్లోజ్ ఫ్రెండ్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకునే రోజుల నుంచే ప్రభాస్‌తో ఉన్న సాన్నిహిత్యం, ఆయనపై ఉన్న అమితమైన అభిమానంతో తన పేరు ముందు ప్రభాస్ అని చేర్చుకున్నారు. కెరీర్ ప్రారంభంలో ప్రభాస్ వ్యక్తిగత, సినీ వ్యవహారాలు చూసుకునే శ్రీను, ఆ తర్వాత పూర్తిస్థాయి నటుడిగా మారిపోయారు. ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘యమదొంగ’, ‘విక్రమార్కుడు,’ ‘గబ్బర్ సింగ్’, ‘ఆగడు’, ‘బలుపు’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘ప్రేమకథా చిత్రమ్’, ‘సుప్రీమ్’, ‘శతమానం భవతి’, ‘వాల్తేరు వీరయ్య’, ‘ఫ్యామిలీ స్టార్’ తదితర సినిమాల్లో ప్రభాస్ శ్రీను పోషించిన పాత్రలు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. సినిమాల సంగతి పక్కన పెడితే. . ఆ మధ్యన ఈ టాలీవుడ్ నటుడి ఆరోగ్యంపై రకరకాల రూమర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూకు హాజరైన ప్రభాస్ శ్రీను తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇంటర్వ్యూలో భాగంగా ‘తాగుడు వల్ల మీ ఆరోగ్యం కూడా పాడైపోయింది అని వార్తలు వచ్చాయి కదా’ అని యాంకర్ అడగ్గా ఇలా సమాధానం చెప్పుకొచ్చారు ప్రభాస్ శ్రీను.

‘ అలాంటిదేమీ లేదు. ఆరోగ్యం పాడు కాలేదు. నేను తాగుతాను కానీ మరీ అతిగా తాగలేదు. సమస్య ఎక్కడ వచ్చింది అంటే.. నేను మానేయాలి అని అనుకున్నప్పుడే సమస్య మొదలైంది. నేను రెగ్యులర్ గా తాగుతున్నప్పుడు నాకు ఎలాంటి సమస్యా ఎదురు కాలేదు. కానీ నా కూతురు ఎదుగుతోంది.. ఇక మానేయాలి అని అనుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. నాలో ఫ్రస్ట్రేషన్ క్రమంగా పెరిగిపోయింది. అలా ఒకసారి అల్లు అర్జున్ గారి ‘నాపేరు సూర్య’ సినిమా షూటింగ్ జరుగుతోంది. అల్లు అర్జున్ తోనే సీన్ చేయాల్సి ఉంది. ఆయనకు నేను చేయి అడ్డు పెట్టి డైలాగ్ చెప్పాలి. రాత్రి తొమ్మిదిన్నరకు షూటింగ్ జరుగుతోంది. కానీ నా చేయి వణకడం అల్లు అర్జున్ గమనించారు. ఏంటి శ్రీను గారు చేయి వణుకుతోంది అని అడిగారు. తొమ్మిదిన్నర అయింది కదా సార్ ఆ టైం కి పడకపోతే మనకు షివరింగ్ ఆగదు అని చెప్పాను. బన్నీ నా వైపు పైకి కింది ఒకసారి చూసి.. ఒకరు మానేయమంటే మానేసేది కాదిది.. మీ అంతట మీరే మానేయాలి. ఎంత మంచి నటుడు మీరు అని ఒక్క లుక్కు ఇచ్చి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ చూసిన ఆ చూపు, చెప్పిన మాటలు నాకు ఫటా ఫటా అంటూ చెంపదెబ్బలు కొట్టినట్లు అనిపించింది. అల్లు అర్జున్ చాలా పెద్ద స్టార్.. ఆయన నా ఆరోగ్యం కోసం ఆలోచించాల్సిన అవసరం ఏముంది.. వీడు తాగుబోతు అయితే మనకేంటి అని ఆయన సైలెంట్ గా వెళ్లిపోయి ఉండొచ్చు. కానీ బన్నీ గారు అలా చేయలేదు. మీరు మంచి నటుడు అని, మానేయాలి అని చెప్పారు. అల్లు అర్జున్ చెప్పిన తర్వాత నాలో ఆలోచన మొదలైంది. నా కూతురి కోసం, అల్లు అర్జున్ చెప్పిన మాటతో ఇప్పుడు తాగుడు పూర్తిగా మానేశాను’ అని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ టాలీవుడ్ నటుడి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us