Virata Parvam: రానా బర్త్ డే స్పెషల్ అప్డేట్.. విరాటపర్వం నుంచి ‘ది వాయిస్ ఆఫ్ రవన్నా’.. ఎప్పుడంటే..

డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో దగ్గుబాటి రానా నటిస్తోన్న చిత్రం విరాట పర్వం. ఎప్పుడో షూటింగ్

Virata Parvam: రానా బర్త్ డే స్పెషల్ అప్డేట్.. విరాటపర్వం నుంచి ది వాయిస్ ఆఫ్ రవన్నా.. ఎప్పుడంటే..
Virata Parvam

Updated on: Dec 13, 2021 | 7:44 PM

డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో దగ్గుబాటి రానా నటిస్తోన్న చిత్రం విరాట పర్వం. ఎప్పుడో షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా దగ్గుబాటి రానా పుట్టిన రోజు సందర్భంగా.. ఈ సినిమా నుంచి ది వాయిస్ ఆఫ్ రవన్నా అంటూ స్పెషల్ అప్డేట్ డిసెంబర్ 14న ఉదయం 10 గంటల 10 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. ఈ క్రమంలో విరాట పర్వం నుంచి మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ట్వీట్..

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ మూవీపై అంచనాలను పెంచేశాయి. యదార్ధ సంఘటనల ఆధారంగా 1990’s నాటి విప్లవ కథగా ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. ఇందులో ప్రియమణి కీలక పాత్రలో నటిస్తుండగా.. రానా సరసన.. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ సినిమాలో రానా, ప్రియమణి నక్సలైట్లుగా కనిపించనున్నారు. అభ్యుదయ భావాలూ కలిగిన యువకుడిగా రానా అద్బుతంగా నటించాడు. అతడి కవితలు చదివి అభిమానిగా మారి అతడి ప్రేమకోసం వెతుకుతూ వెళ్లి చిక్కుల్లో పడ్డ యువతిగా సాయిపల్లవి కనిపిస్తుంది. అలాగే విరాటపర్వంలో నందితా దాస్, నవదీప్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. డి.సురేష్ బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read: Samantha: హీరోయిన్ సమంతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స..

Rashmika Mandanna: ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డానన్న నేషనల్ క్రష్ రష్మిక.. ఇంతకు ఏమైందంటే..

Miss Universe : ఇప్పటివరకు ఇండియా తరపున విశ్వ సుందరి పోటీలో పాల్గొన్న భామలు వీరే..

Samantha: వివాదంలో సమంత ఐటెం సాంగ్.. కోర్టుకెక్కిన పురుషుల సంఘం.. పుష్ప పాట మగవాళ్లను కించపరిచేలా ఉందంటూ..