AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

430కు పైగా సినిమాలతో తోపు యాక్టర్.. అంత్యక్రియలకు కూడా డబ్బులేని దీనస్థితి అనాధగా మరణించింది

కల్పనారాయ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 1950లో కాకినాడలో సత్యవతి పేరుతో జన్మించారు. యుక్తవయసులో అందంగా కనిపించే ఆమె, ఒంటి నిండా బంగారు ఆభరణాలతో ఆకట్టుకునేవారు. ఊరికి మొనగాడు సినిమాతో వెండితెర అరంగేట్రం చేశారు. కల్పనారాయ్ గొప్ప దయాగుణం కలవారు.

430కు పైగా సినిమాలతో తోపు యాక్టర్.. అంత్యక్రియలకు కూడా డబ్బులేని దీనస్థితి అనాధగా మరణించింది
Kalpana Rai
Ravi Kiran
|

Updated on: Mar 22, 2026 | 10:00 PM

Share

తెలుగు నటి కల్పనారాయ్ జీవితం అంతులేని దానధర్మాలకు, కష్టాలకు నిలువెత్తు నిదర్శనం. తన అపారమైన దానగుణంతో ఆస్తిని కోల్పోయి, ఆదరణకు నోచుకోలేదు. దత్తపుత్రిక కూడా దూరం కావడంతో ఒంటరిగా మిగిలి, చివరి రోజుల్లో తిండిలేక అలమటించింది. ఆమె అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దుస్థితి ఏ కళాకారునికి రాకూడదు.

వివరాల్లోకి వెళ్తే..! కల్పనారాయ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 1950లో కాకినాడలో సత్యవతి పేరుతో జన్మించారు. యుక్తవయసులో అందంగా కనిపించే ఆమె, ఒంటి నిండా బంగారు ఆభరణాలతో ఆకట్టుకునేవారు. ఊరికి మొనగాడు సినిమాతో వెండితెర అరంగేట్రం చేశారు. కల్పనారాయ్ గొప్ప దయాగుణం కలవారు. బాధల్లో ఉన్నవారికి తక్షణమే తన చేతికున్న బంగారు గాజులు తీసి ఇచ్చేవారు. దానధర్మాల వల్ల ఆమె తన ఆస్తిపాస్తులు, బంగారం మొత్తాన్ని కోల్పోయారు. అయినప్పటికీ, అప్పులు చేసి మరీ అందరికీ భోజనం పెట్టేవారు. ఈ అపారమైన మంచితనమే ఆమె జీవితానికి శాపంగా మారింది. ఆమె వద్ద డబ్బు లేకపోవడంతో అందరూ దూరమయ్యారు.

కల్పనారాయ్ వివాహం చేసుకోలేదు. ఒక అమ్మాయిని దత్తత తీసుకుని పెంచారు. అయితే, ఆ అమ్మాయి యుక్తవయసు వచ్చాక ఒకరిని ప్రేమించి పారిపోవడంతో కల్పనారాయ్ తీరని బాధకు గురయ్యారు. ఆమె ఒంటరిగా మిగిలి, చివరి రోజుల్లో దాదాపు పది రోజులపాటు ఆహారం లేక ఆకలితో అలమటించారు. కల్పనారాయ్ మరణించినప్పుడు ఆమె అంత్యక్రియలకు సైతం డబ్బుల్లేని దుస్థితి ఏర్పడింది. ఈ విషాదకర సంఘటన గురించి నటి జయశ్రీ గతంలో ఒక ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకుంటూ వివరించారు. ఆమె చితికి నిప్పు పెట్టడానికి ఇతరుల ఆర్థిక సహాయం అవసరమైందని తెలిపారు. కల్పనారాయ్ అతి మంచితనం ఆమెను నిస్సహాయ స్థితికి నెట్టింది.

ఇది చదవండి: చనిపోయే ముందు సౌందర్య గర్భవతి.. ప్రేమించింది అతడినే.! ఎవ్వరికీ తెలియని నిజం

Follow Us