Thamanna: డిజిటల్‌ ప్రాజెక్ట్స్‌తోపాటు బుల్లితెర పై కూడా సందడి చేయనున్న మిల్కీబ్యూటీ..

|

Jun 18, 2021 | 7:05 AM

మిల్కీ బ్యూటీ తమన్నా ట్రెండ్ మార్చారు. ఇన్నాళ్లు గ్లామర్ హీరోయిన్‌గా సిల్వర్‌ స్క్రీన్‌ షేక్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు రొమాంటిక్‌ రోల్స్‌కు నో అంటే నో అనేస్తున్నారు.

Thamanna: డిజిటల్‌ ప్రాజెక్ట్స్‌తోపాటు బుల్లితెర పై కూడా సందడి చేయనున్న మిల్కీబ్యూటీ..
Follow us on

Thamanna: మిల్కీ బ్యూటీ తమన్నా ట్రెండ్ మార్చారు. ఇన్నాళ్లు గ్లామర్ హీరోయిన్‌గా సిల్వర్‌ స్క్రీన్‌ షేక్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు రొమాంటిక్‌ రోల్స్‌కు నో అంటే నో అనేస్తున్నారు. కొంత కాలంగా క్యారెక్టర్స్‌ విషయంలో సెలెక్టివ్‌గా ఉన్న ఈ బ్యూటీ.. తన రోల్‌కు ఇంపార్టెన్స్‌ ఉంటేనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రీసెంట్‌గా డిజిటల్ ఎంట్రీలోనూ సత్తా చాటారు ఈ బ్యూటీ. 11th అవర్‌తో డిజిటల్ ఆడియన్స్‌ను ఫిదా చేసిన మిల్కీ బ్యూటీ … తరువాత నవంబర్‌ స్టోరీస్‌తో నేషనల్ లెవల్‌లో సౌండ్ చేశారు. అదే జోరులో మరిన్ని డిజిటల్‌ ప్రాజెక్ట్స్‌ కు రెడీ అవుతున్నారు. నాట్‌ ఓన్లీ డిజిటల్ కాన్సెప్ట్స్.. కంటెంట్‌ ఎగ్జైటింగ్‌ ఉంటే బుల్లితెరకు కూడా రెడీ అంటున్నారు.

తాజాగా తమన్నా ఓ కుకరీ షో హోస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇంటర్‌నేషనల్‌ లెవల్‌లో పాపులర్ అయిన మాస్టర్ చెఫ్‌ తెలుగు వర్షన్‌కు తమన్నా హోస్ట్‌గా వ్యవహరించే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ షో తమిళ వర్షన్‌కు సంబంధించి ఈ మధ్యే ఎనౌన్స్‌మెంట్ వచ్చింది. విజయ్‌ సేతుపతి కోలీవుడ్‌లో ఈ షోను హోస్ట్ చేస్తున్నారు. అదే షోను తెలుగులో తమన్నాతో ప్లాన్ చేస్తున్నారట మేకర్స్‌. ఇక తమన్నా సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీటీమార్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో మ్యాచో హీరో గోపీచంద్ నటిస్తున్నాడు. అలాగే  సత్య దేవ్ హీరోగా నటిస్తున్న గుర్తుందా శీతాకాలం సినిమాలో చేస్తుంది. ఇలా సినిమాలతో మరోవైపు టీవీ షోలతోనూ బిజీ గా ఉంది తమన్నా.

మరిన్ని ఇక్కడ చదవండి :

Tollywood: మళ్లీ మొదలైన సినిమా సందడి.. రిలీజ్ కు రెడీ అవుతున్న వాయిదా పడిన సినిమాలు..

Allu Sneha: అరుదైన రికార్డు అందుకున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. ఏ హీరో భార్య‌కు ద‌క్క‌ని ఆ రికార్డు ఏంటంటే..

Shekhar Kammula: పాన్ ఇండియా ద‌ర్శ‌కుల జాబితాలోకి శేఖ‌ర్ క‌మ్ముల‌.. ధ‌నుష్‌తో చేతులు క‌ల‌ప‌నున్నాడా..?

Siddharth: మ‌హాస‌ముద్రం కోసం సిద్దార్థ్ అంత తీసుకుంటున్నాడా.? తెలుగులో సిద్దు క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదుగా..