AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం పాట రా బాబూ.. పది రోజుల్లోనే యూట్యూబ్‏లో సంచలనం.. విన్నా కొద్ది వినాలనిపిస్తున్న సాంగ్..

యూట్యూబ్‏లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన జానపద పాటలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. నెట్టింట పాటల రీల్స్ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అదే బాటలో శ్రోతలను, సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఒక పాట మాత్రం నెట్టింట సంచలనం క్రియేట్ చేస్తుంది.

ఏం పాట రా బాబూ.. పది రోజుల్లోనే  యూట్యూబ్‏లో సంచలనం.. విన్నా కొద్ది వినాలనిపిస్తున్న సాంగ్..
Folk Song
Rajitha Chanti
|

Updated on: Aug 03, 2026 | 8:41 AM

Share

ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే సరదా సరసారలతో సాగే ఒక పాట ఇప్పుడు నెట్టింట దూసుకుపోతుంది. గత కొన్నాళ్లుగా కొన్ని పాటలు కోట్లాది మంది జనాలను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఒక ఫోక్ సాంగ్ విపరీతంగా ట్రెండ్ అవుతుంది. అదే తెల్ల చీర తెల్ల రైక. ఈ జానపద గీతం ఎక్కడ చూసిన మారుమోగుతుంది. స్వచ్చమైన పల్లెటూరి వాతావరణాన్ని, బావా మరదళ్ల మధ్య సాగే సరదా ప్రేమాయణాన్ని ప్రతిబింబించేలా తెరకెక్కించారు. ముఖ్యంగా పల్లెటూరి ఫోక్ సింగర్ మల్లమ్మ రాసిన ఈ పాట లిరిక్స్ తెలంగాణ పల్లెటూరి వాతావరణాన్ని చూపిస్తుంది. కళ్యాణ్ కీస్ అందించిన మాస్ అండ్ క్యాచీ మ్యూజిక్, కొంగరి కృష్ణ అద్భుతమైన సాహిత్యం, గాత్రం ఈ పాటకు బలంగా నిలిచాయి.

ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

ఇక కొరియోగ్రాఫర్ శేఖర్ అందించిన నాటు డ్యాన్స్ మూమెంట్స్, హావభావాలతో సాగిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘తెల్ల చీర.. తెల్ల రైక’ అంటూ సాగే ఈ పాట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతుంది. యూట్యూబ్ లో విడుదలైన కేవలం 10 రోజుల్లోనే దాదాపు 50 లక్షలకు పైగా వ్యూస్ అందుకుంది. ఇక ఇప్పుడు ఎక్కడా విన్నా ఈ పాట వినిపిస్తుంది. బావ తన మరదలిని ఆటపట్టిస్తూ ముద్దుగా ముచ్చటించడం, నగలు తెస్తానంటూ ఆశపెట్టడం వంటి సన్నివేశాలు పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఎక్కువమంది చదివినవి :  K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ పాట మిలియన్ల కొద్దీ వ్యూస్, వేలాది లైక్స్‌ సాధించి చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్, షార్ట్స్, శుభకార్యాల డ్యాన్సుల్లో ఈ పాట మారుమోగిపోతోంది. జానపద సంగీత ప్రియులకు ఈ ‘తెల్ల చీర తెల్ల రైక’ పాట ఒక బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛాయిస్‌గా మారింది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

తెల్ల చీర తెల్ల రైక సాంగ్..

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

Follow Us