Tamil Nadu Election 2026: ఆ పార్టీకే ఓటేశా.. ఆయన సీఎం అవ్వడం ఖాయం.. పబ్లిక్‌గా చెప్పేసిన స్టార్ కమెడియన్.. వీడియో

ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటర్లు తాము ఎవరికి ఓటేశారో బహిరంగంగా వెల్లడించకూడదు. కానీ నటుడు వీటీవీ గణేష్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా తాను ఎవరికి ఓటు వేశాడో మీడియా ముఖంగా చెప్పేశాడు. అంతేకాదు యువత అందరూ ఆ పార్టీకే ఓటేయాలని పిలుపునిచ్చాడు.

Tamil Nadu Election 2026: ఆ పార్టీకే ఓటేశా.. ఆయన సీఎం అవ్వడం ఖాయం.. పబ్లిక్‌గా చెప్పేసిన స్టార్ కమెడియన్.. వీడియో
VTV Ganesh

Updated on: Apr 23, 2026 | 4:31 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రసవత్తరంగా జరుగుతోంది. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. టీవీకే అధినేత హీరో విజయ్, రజనీకాంత్, అజిత్, ధనుష్, శ్రుతి హాసన్, కమల్ హాసన్, త్రిష, ఖుష్బూ, శివ కార్తికేయన్, డైరెక్టర్ అట్లీ తదితర ప్రముఖులు తమకు కేటాయించిన పోలీంగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. అయితే ఎన్నికల్లో ఓటేసిన పలువురు సినీ ప్రముఖులు తాము ఎవరికి ఓటు వేశామో తెలిసే విధంగా పరోక్ష సంకేతాలు ఇస్తున్నారు. ఇక నటుడు వీటీవీ గణేష్ అయితే బహిరంగంగానే తాను ఎవరికి ఓటేశారో చెప్పేశారు. జైలర్ తో పాటు పలు తమిళ, తెలుగు సినిమాల్లో కమెడియన్ పాత్రలు పోషించిన వీటీవీ గణేష్ చెన్నై నందనంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్​లో ఓటు వేశాడు. అనంతరం బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు. తాను టీవీకే పార్టీకే ఓటు వేశానని, సమాజాన్ని, ప్రజలను, వ్యవస్థను ఉన్నతీకరించడానికి విజయ్ సరైన వ్యక్తి అని గణేష్ తెలిపారు.

‘ఇప్పుడే నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. విజయ్‌ పార్టీ టీవీకేకు ఓటు వేశాను. సొసైటీని అప్‌గ్రేడ్ చేయడానికి విజయ్ పర్‌ఫెక్ట్ ఫిట్ అని నేను గట్టిగా నమ్ముతున్నాను. సిస్టమ్, ప్రజలకు మంచి చేస్తారని బలంగా నమ్ముతున్నాను. నాకు ఇతర పార్టీల గురించి మాట్లాడటం ఇష్టం లేదు. ఎందుకంటే నేను టీవీకే పార్టీకి చెందిన వాడిని కాబట్టి ఆ పార్టీ గురించే మాట్లాడుతాను. టీవీకే పార్టీ గెలువాలని బలంగా కోరుకొంటున్నాను. నిన్నటి వరకు విజయ్ పార్టీ గెలుస్తుందా? లేదా? అనే కొంత సందేహం ఉండేది. ఓటింగ్ సరళిని చూస్తే ఈ రోజు మాత్రం విజయ్ పార్టీ విజయం సాధించడం ఖాయమని తేలిపోయింది. మే 4వ తేదీ వరకు వేచి ఉండండి. టీవీకే పార్టీ గెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు’ వీటీవీ గణేష్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

 

వీడియో ఇదిగో..

కాగా విజయ్‌ టీవీకే పార్టీ తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. విజయ్‌ కూడా తిరుచురాపల్లి ఈస్ట్‌, పెరంబూర్‌ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. మే 4న తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us