Viral Pic: ఈ చిన్నారి ఇప్పుడొక టాప్ హీరోయిన్.. ఫ్యాన్స్‌లో పిచ్చ క్రేజ్.. కనిపెట్టండి చూద్దాం!

|

Aug 10, 2021 | 3:23 PM

హీరోలు, హీరోయిన్లకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు తరచూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంటాయి. వాటిపై ఫ్యాన్స్ కూడా...

Viral Pic: ఈ చిన్నారి ఇప్పుడొక టాప్ హీరోయిన్.. ఫ్యాన్స్‌లో పిచ్చ క్రేజ్.. కనిపెట్టండి చూద్దాం!
Follow us on

హీరోలు, హీరోయిన్లకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు తరచూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంటాయి. వాటిపై ఫ్యాన్స్ కూడా ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తుంటారు. అందుకే అవి క్షణాల్లో వైరల్‌గా మారతాయి. కీర్తి సురేష్, సాయి పల్లవి, రష్మిక మందన్నా, రకుల్ ప్రీత్ సింగ్ ఇలా చాలామంది హీరోయిన్ల చైల్డ్‌హుడ్ ఫొటోస్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇదే కోవలో ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో నెట్టింట హల్చల్ చేస్తోంది.

ముసిముసి నవ్వులతో ఫోటోకి ఫోజిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.? ఇప్పుడు ఈమె టాలీవుడ్ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళం, హిందీ చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. కనిపెట్టలేకపోతున్నారా.! అయితే మీకో చిన్న క్లూ. ఈ హీరోయిన్‌ను ఫ్యాన్స్ ముద్దుగా ‘మిల్కీ బ్యూటీ’ అని పిలుస్తారు. గుర్తుపట్టేశారా.! ఆమె ఎవరో కాదు తమన్నా భాటియా. ఇలా నవ్వుతూ ఫోజిచ్చిన ఈ పిక్చర్‌కు కామెంట్స్, లైకులు హోరెత్తుతున్నాయి.

కాగా, తమన్నా ప్రస్తుతం తెలుగులో అరడజన్ సినిమాల్లో నటిస్తోంది. ‘మాస్ట్రో’, ‘ఎఫ్ 3’, ‘గని’, ‘సీటిమార్’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘దట్ ఈజ్ మహాలక్ష్మీ’ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది.

Also Read:

సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!

బైక్ డూమ్ నుంచి వింత శబ్దాలు.. తెరిచి చూస్తే షాక్.. నెట్టింట వైరల్!