
బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ ఫిల్మ్ వర్గాల్లో ఊహించని విషాదాన్ని నింపింది. కెరీర్ మంచి ఉచ్చ దశలో ఉన్న సమయంలో అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో బాలీవుడ్ లో నెపోటిజం కూడా అతడి మరణానికి ఓ కారణం అయ్యిండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సెలబ్రిటీలు అదే నిజమంటూ విమర్శలు చేస్తున్నారు కూడా. ఈ క్రమంలోనే గత ఆరు నెలల్లో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఏడు సినిమాలను కోల్పోయాడని రాజకీయ నాయకుడు సంజయ్ నిరుపమ్ పేర్కొన్నారు. గతేడాది రిలీజైన ‘చిచోరే’ విజయం తర్వాత సుశాంత్ ఏడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. అయితే ఆరు నెలల సమయంలోనే అవన్నీ అతడి నుంచి చేజారిపోయాయని తెలిపారు. అయితే ఆ చిత్రాలు ఏవి అన్న విషయాలపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రూరత్వం ఎక్కువని.. అదే సుశాంత్ మరణానికి కారణమైందని నిరుపమ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
छिछोरे हिट होने के बाद #सुशांत_सिंह_राजपूत ने सात फिल्में साइन की थी।
छह महीने में उसके हाथ से सारी फिल्में निकल गई थीं।क्यों ?
फ़िल्म इंडस्ट्री की निष्ठुरता एक अलग लेवल पर काम करती है।
इसी निष्ठुरता ने एक प्रतिभावान कलाकार को मार डाला।
सुशांत को विनम्र श्रद्धांजलि!#RIPSushant— Sanjay Nirupam (@sanjaynirupam) June 14, 2020
‘పవిత్ర రిష్టా’ అనే టీవీ సీరియల్‌తో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత వెండితెర ఎంట్రీ ఇచ్చి హీరో అయ్యారు. 2013లో రిలీజైన ‘కై పో చే’ బాలీవుడ్లో అరంగేట్రం చేసి.. ‘ధోని: అన్‌టోల్డ్ స్టోరీ’, ‘సోంచిరియా’, ‘కేదార్నాథ్’, ‘డిటెక్టివ్ బ్యోమకేశ్ బక్షి’ సినిమాలతో నటుడిగా తన స్థాయిని పెంచుకున్నారు.
తాజాగా సుశాంత్ మృతికి సంతాపం తెలిపిన బాలీవుడ్ దర్శకుడు అభినవ్ కశ్యప్.. పలు సంచలన కామెంట్స్ చేశారు. తన కెరీర్‌ను సల్మాన్ ఖాన్, అతడి ఫ్యామిలీ మెంబర్స్ నాశనం చేశారని ఆరోపించారు.టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ పన్నే పన్నాగాల వల్ల కూడా టాలెంట్ ఉన్న నటీనటులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు అభినవ్. సుశాంత్ బలవన్మరణానికి కారణం అదే కారణమని తెలిపారు.
Please take a moment to read this post by Dabangg’s director, Abhinav Kashyap.
He talks about how he has been bullied & mentally tortured by the bigwigs (Salman Khan & family) of Bollywood. I am appalled. pic.twitter.com/Nj9WIFymEx— Chamku (@Chamkeelii) June 15, 2020