
టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ మంచి నటుడు. ఎంత కెపాసిటీ లేకపోతే త్రివిక్రమ్ అతడికి అల..వైకుంఠపురం సినిమాలో అంత మంచి పాత్ర ఇస్తారు చెప్పండి. కాగగా సుశాంత్ తాజాగా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శనివారంతో కంప్లీట్ అయ్యింది. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు సుశాంత్. ఈ సినిమాతో దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఏ1 స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. డిసెంబరులో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే అది థియేటర్లలోనా లేదంటే ఓటీటీ అనేది తెలియాల్సి ఉంది.
Also Read :
అక్కడ బుల్లెట్‌కు పూజలు, గుడి కూడా కట్టేశారు !
వీసా కోసమే పెళ్లి..రాధికా ఆప్టే సంచలన స్టేట్మెంట్