
కోవిడ్-19 వ్యాప్తి, సంక్షోభ పరిస్థితుల కారణంగా తమిళ సీనియర్ హీరో సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ మూవీ రిలీజ్ వాయిదా పడింది. అయితే సోషల్ మీడియాలో ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త హల్ చల్ చేసింది. జులై 23 సూర్య బర్త్ డే సంద్భంగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే మూవీ యూనిట్ అభిమానులకు షాకిచ్చింది.
సూర్య బర్త్‌డే రోజున ట్రైలర్‌ను రిలీజ్ చేయడం లేదని స్పష్టం చేసింది. ఆ రోజున ‘కాటుక కన్నులే’ అనే నిమిషం నిడివిగల వీడియో సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ అఫిషియల్ గా ప్రకటించింది. ఈ చిత్రంలో డైలాగ్ కింగ్, టాలీవుడ్ విలక్షణ నటుడు మంచు మోహన్‌బాబు కీ రోల్ పోషిస్తున్నారు. లేడీ డైరెక్టర్ సుధా కొంగర మూవీని తెరకెక్కించగా.. సూర్య, బాలీవుడ్ నిర్మాత గుణీత్ మోంగ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు. గత కొంతకాలంగా సరైన హిట్ లేక కెరీర్ లో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు సూర్య. ‘ఆకాశమే నీ హద్దురా’ అతడికి బ్రేక్ ఇస్తుందని అభిమానులు భావిస్తున్నారు.