మహేష్ బాబు పుట్టినరోజుకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు కొత్త సినిమా గురించి ఏదైనా అప్డేట్ వస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ‘గుంటూరు కారం’ సినిమాతో మహేష్ అభిమానులు కాస్త నిరాశపడ్డారు. దాంతో ఇప్పుడు మహేష్ నెక్స్ట్ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రముఖ దర్శకుడు రాజమౌళితో మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు. మహేష్ బాబు, రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అలాగే ఈ సినిమా టైటిల్పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. టైటిల్ గురించి ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
రాజమౌళి ప్రతి సినిమాకి చాలా సమయం కేటాయిస్తుంటారు. మహేష్ బాబుతో సినిమా విషయంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ను ప్రకటించే అవకాశం ఉంది. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా టైటిల్ రివీల్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఎలాంటి అప్డేట్ రాదు అని తెలుస్తోంది. కాగా ఈ చిత్రానికి ‘గోల్డ్’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
టైటిల్పై చిత్ర బృందం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయినా కూడా ‘గోల్డ్’ అనే టైటిల్ గట్టిగానే వినిపిస్తోంది. అయితే ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని ఇప్పటికే విజయంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చారు. ఇండియన్ జోన్స్ తరహాలో ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. కారడవుల్లో బంగారం కోసం జరిగే వేట నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని అంటున్నారు. అలాగే ఈ అడవుల్లో మహేష్ చేసే సాహసాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయట. అందుకే ఈ సినిమాకు గోల్డ్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది మహేష్ బాబుకి 29వ సినిమా. టైటిల్ వెల్లడించే వరకు ఈ చిత్రానికి తాత్కాలికంగా ‘SSMB 29’ అని పేరు పెట్టారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు గెటప్ పూర్తిగా మార్చేశారు. ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ రాశారు. ‘ఆర్ఆర్ఆర్’ గ్రాండ్ సక్సెస్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాపై అభిమానుల్లో విపరీతమైన హైప్ క్రియేట్ అయింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి