
Sarkaru Vaari Paata :సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా.. పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ సరికొత్త లుక్లో కనిపించబోతున్నట్లుగా మొదటి నుంచి టాక్ వినిపిస్తోంది. దీంతో సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ లుక్, ఫస్ట్ నోటీస్ పేరుతో విడుదలైన ఫోటోలకు రెస్పాన్స్ మాములుగా రాలేదు. ఈ క్రమంలో సర్కారు వారి పాట టీం.. అభిమానులకు గుడ్ న్యూస్ అందించిన సంగతి తెలిసిందే. అన్నట్టుగానే సర్కారు వారి పాట నుంచి మహేష్ ఫస్ట్ లుక్ తోపాటు మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్.
తాజాగా విడుదలైన మహేష్ లుక్ అదిరిపోయింది. అలాగే ఈ మూవీని 2020 జనవరి 13న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. అనుకున్నట్లుగానే.. సంక్రాంతి కానుకగా సర్కారు వారి పాట ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక దుబాయ్లో భారీ షెడ్యూల్ పూర్తిచేసుకున్న సర్కారు వారి పాట.. ఇటివలే హైదరాబాద్లో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసింది. ఇందులో విలన్ పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నారు. ఇక ఆగస్ట్ 9 మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీకి అభిమానులు మరో బ్లస్టర్ కు సిద్ధంగా ఉండాలంటూ ట్వీట్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థం. దీంతో మహేష్ బర్త్ డే కు టీజర్ రాబోతున్నట్లుగా హింట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదిలాఉంటే .. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సుబ్బరాజు కీలక పాత్రలో నటిస్తుండగా.. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
ట్వీట్..
Also Read: