Sudheer Babu: గ్లిజరిన్ లేకుండా ఏడ్చేయగల హీరోయిన్ ఆమె.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన సుధీర్ బాబు..

హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రాబోతోన్న మూడవ‌ చిత్రం `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`.

Sudheer Babu: గ్లిజరిన్ లేకుండా ఏడ్చేయగల హీరోయిన్ ఆమె.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన సుధీర్ బాబు..
Sudheer Babu

Updated on: Jan 01, 2022 | 8:32 PM

Sudheer Babu: హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రాబోతోన్న మూడవ‌ చిత్రం `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`. ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.`ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది.

ఈ సందర్భంగా  హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ..ఇంద్రగంటి గారితో నాకిది మూడో సినిమా. నేను హీరోయిన్ తో కూడా మూడు చిత్రాలు చేయలేదు . ఆయనతో అంత ఫ్రెండ్ షిప్ ఉంది అని అన్నాడు. ఆ అమ్మాయి గురించి చెప్పాలి చిత్రానికి మీరు ఎక్కడా వంక పెట్టలేరు. అంత పర్ ఫెక్ట్ గా ఉంటుంది. సమ్మోహనం లో సినిమాలంటే ఇష్టం లేని క్యారెక్టర్ చేశాను. ఆ అమ్మాయి గురించి చెప్పాలి చిత్రంలో సినిమా డైరెక్టర్ క్యారెక్టర్ లో నటిస్తున్నాను. ఈ సినిమా కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. హీరో ఇంట్రడక్షన్ సాంగ్, ఐటెం సాంగ్ కూడా ఉంటుంది. కృతి గురించి చెప్పాలంటే కోరినట్లు నటించగల ప్రతిభ ఉన్న హీరోయిన్. కావాలంటే గ్లిజరిన్ లేకుండా ఏడ్చేయగలదు. బెంచ్ మార్క్ స్టూడియోస్ కు మొదటి సినిమా అయినా కంగారు లేకుండా జాగ్రత్తగా నిర్మించారు. ఈ చిత్రానికి మైత్రీ మూవీస్ అసోసియేట్ అవడం ఇంధనం లాంటిది. వాళ్లకు థాంక్స్ చెబుతున్నా. అని చెప్పుకొచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Deepthi Sunaina-Shanmukh: షణ్ముఖ్‏తో బ్రేకప్.. భావోద్వేగ పోస్ట్ షేర్ చేసిన దీప్తి సునయన..

Viral Photo: బ్యాట్ పట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!

Telangana – Theater: ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్రెసిడెంట్ ప్రకటన..

Loading...
Unable to load recommendations.
Follow Us