ఆలియా భట్ కి జక్కన్న కాంప్లిమెంట్ …

ఆలియా భట్ కి జక్కన్న కాంప్లిమెంట్ ...

ట్రిపులార్ మూవీకి సంబంధించి అప్డేట్స్ మళ్ళీ వేగం అందుకున్నాయి. తన సినిమాలో సీత క్యారెక్టర్ గురించి, ఆ క్యారెక్టర్ కోసం ఎంచుకున్న ఆలియా భట్ గురించి చెబుతూ ట్వీట్ చేశారు దర్శకులు రాజమౌళి. తాను తియ్యబోయే కథ ట్రయాంగులర్ లవ్ స్టోరీ కాకపోయినప్పటికీ.. సీత క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉందన్నారు జక్కన్న. తారక్, చెర్రీల్లాంటి ఇద్దరు టాలెంటెడ్ హీరోలకు సరితూగేలా ఎమోషన్స్ పండించాల్సిన బలమైన క్యారెక్టర్ సీత అన్నారు. అమాయకురాలే అయినా స్థిర చిత్తం కలిగిన […]

Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

May 05, 2020 | 8:42 PM

ట్రిపులార్ మూవీకి సంబంధించి అప్డేట్స్ మళ్ళీ వేగం అందుకున్నాయి. తన సినిమాలో సీత క్యారెక్టర్ గురించి, ఆ క్యారెక్టర్ కోసం ఎంచుకున్న ఆలియా భట్ గురించి చెబుతూ ట్వీట్ చేశారు దర్శకులు రాజమౌళి. తాను తియ్యబోయే కథ ట్రయాంగులర్ లవ్ స్టోరీ కాకపోయినప్పటికీ.. సీత క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉందన్నారు జక్కన్న.

తారక్, చెర్రీల్లాంటి ఇద్దరు టాలెంటెడ్ హీరోలకు సరితూగేలా ఎమోషన్స్ పండించాల్సిన బలమైన క్యారెక్టర్ సీత అన్నారు. అమాయకురాలే అయినా స్థిర చిత్తం కలిగిన మహిళ సీత. అంత ప్రాముఖ్యత గల పాత్ర కనుకే.. దానికి ఆలియాభట్ ని ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. తన నమ్మకాన్ని నిలబెట్టే సత్తా ఆమెకుందన్నారు. ఇందులో కొమరం భీంగా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నారు. జనవరి 8న రిలీజ్ కావాల్సి వుంది ట్రిపులార్ మూవీ. ప్ర‌స్తుత లాక్ డౌన్ కార‌ణంగా సినిమా షూటింగ్ వాయిదా ప‌డ‌టంతో మూవీ రిలీజ్ వాయిదా ప‌డే అవ‌కాశం ఉంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu