
భారతదేశంలో ‘ స్పైడర్‌మ్యాన్ : బ్రాండ్ న్యూ డే’ విడుదలై వారం రోజులు అయింది. ఈ చిత్రం భారత బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. జూలై 30న విడుదలైన ఈ చిత్రం, కేవలం ఐదు రోజుల్లోనే 350 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ వీకెండ్ లో 600 కోట్ల మార్కును దాటే అవకాశం ఉంది. ‘స్పైడర్‌మ్యాన్’లో ప్రధాన పాత్ర పోషించిన టామ్ హాలండ్, ఇటీవల తన మరో చిత్రం ‘ది ఆడాసిటీ’ ప్రచార నిమిత్తం భారతదేశానికి వచ్చారు. ఇప్పుడు, ఒక ఇంటర్వ్యూలో టామ్ హాలండ్ భారతదేశం గురించి, అలాగే తనకు ఇష్టమైన భారతీయ సినిమా గురించి మాట్లాడారు. ‘భారతదేశ పర్యటన అద్భుతంగా ఉంది. ఇది నా జీవితంలో మరచిపోలేని యాత్ర. నేను భారతదేశానికి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మళ్లీ ఇక్కడికి రావడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను. నేను అద్భుతమైన వ్యక్తులను కలిశాను. టేస్టీ ఫుడ్ ను ఆస్వాదించాను. అలాగే అద్భుతమైన అంబానీ కల్చరల్ సెంటర్‌ను చూసే అవకాశం లభించింది. మొత్తంగా, నేను ఇండియాలో అత్యంత అద్భుతమైన సమయాన్ని గడిపాను’. మీరు ఏదైనా భారతీయ సినిమా చూశారా అని ఇంటర్వ్యూయర్ అడగగా, టామ్ హాలండ్, “నేను ‘RRR’ సినిమా చూశాను, అది నాకు చాలా నచ్చింది” అని అన్నారు. రాజమౌళి దర్శకత్వంలో, రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘RRR’ సినిమా టామ్ హాలండ్‌కు నచ్చిందట. ఈ క్రమంలో ‘RRR’ సినిమా తనకు నచ్చిందని టామ్ హాలండ్ చెబుతున్న ఒక వీడియో క్లిప్‌ను ‘RRR’ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
టామ్ హాలండ్ మాత్రమే కాదు, చాలా మంది హాలీవుడ్ ప్రముఖులు ‘RRR’ సినిమాను చూసి మెచ్చుకున్నారు. గతంలో ప్రపంచ సినిమా రంగంలో అత్యుత్తమ దర్శకులలో ఒకరిగా పరిగణించబడే ‘టైటానిక్’, ‘అవతార్’ చిత్రాల దర్శకుడు జేమ్స్ కామెరాన్, అలాగే పలు ఆస్కార్ అవార్డు లు గెలుచుకున్న చిత్రాలకు దర్శకత్వం వహించిన స్టీవెన్ స్పీల్‌బర్గ్ వంటి అనేక ఇతర ప్రముఖులు కూడా ‘RRR’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. కాగా టామ్ హాలండ్ చాలా సంవత్సరాలుగా ‘స్పైడర్-మ్యాన్’ పాత్రను పోషిస్తున్నారు. ఇప్పుడు విడుదలైన ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ఆయన నటించిన నాలుగవ ‘స్పైడర్-మ్యాన్’ సోలో చిత్రం. కానీ ఇదే ఆయన చివరి చిత్రం అని అంటున్నారు. తదుపరి ‘స్పైడర్-మ్యాన్’ చిత్రంలో ఈ పాత్రను ఒక కొత్త హీరో నటించనున్నాడని తెలుస్తోంది.
Spidey ❤️❤️ 🕷️ https://t.co/m3Ypkf8UaY
— RRR Movie (@RRRMovie) August 4, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.