Sonu Sood : సోనుసూద్‌‌పై ఇది వేరే లెవల్ అభిమానం..! 50 వేల చదరపు విస్తీర్ణంలో భారీ చిత్రం

Sonu Sood : తన దానగుణంతో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి నటుడు

Sonu Sood :  సోనుసూద్‌‌పై ఇది వేరే లెవల్ అభిమానం..!  50 వేల చదరపు విస్తీర్ణంలో భారీ చిత్రం
Sonu Sood

Updated on: Aug 02, 2021 | 4:41 PM

Sonu Sood : తన దానగుణంతో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి నటుడు సోనూసూద్. కరోనా కాలంలో ఆపదలో ఉన్నాం ఆదుకోండి అంటూ ఒక్క సందేశం పంపితే చాలు తన టీంని పంపి ప్రజల అవసరాలు తీర్చిన వ్యక్తి. జాతి మొత్తం గర్వించే రీతిలో సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న సోనూసూద్ సామాన్యుడి మనసును గెలిచారు. ప్రజల మనసుల్లో్ చోటు దక్కించుకున్న సోనూసూద్ పుట్టినరోజును ఆయన అభిమానులు తమ ఇంట్లో సభ్యుడి వేడుకలా జరుపుకున్నారు. కొందరు అభిమానులు వందల కిలోమీటర్లు ప్రయాణించి తమ అభిమాన వ్యక్తిని కలుసుకుంటుండగా మరికొందరు సామాజిక మాధ్యమాల వేదికగా తమ శుభాకాంక్షలను వ్యక్తం చేస్తున్నారు.

ఇది వేరే లెవెల్
సోనూసూద్ పుట్టినరోజును పురస్కరించుకొని విపుల్ మిరాజ్కర్ అనే కళాకారుడు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గీసిన చిత్రం ఇప్పుడు వైరల్ గా మారింది. విస్తారమైన పచ్చని మైదానంలో 20 రోజులపాటు శ్రమించి నెగెటివ్ స్పేస్ ను తీసేసి రూపొందించిన ఆ చిత్రం చూపరులను కట్టిపడేస్తోంది. డ్రోన్ విజువల్స్ లో సోనూసూద్ చిత్రం బాహుబలి కటౌట్ ను తలపిస్తూ చూపరులను కనువిందు చేస్తోంది.

సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోను పంచుకున్న విపుల్ మిరాజ్కర్.. సోనూసూద్ భాయ్.. బర్త్‌డే సర్ ప్రైజ్ పోట్రైట్.. అంటూ శుభాకాంక్షలు చెప్పాడు. చిత్రలేఖనంలో అపారమైన అనుభవం ఉంటే తప్పా నెగెటివ్ స్పేస్ ను ఉపయోగించి చిత్రాలను రూపొందిచలేం. అలాంటిది విపుల్ గీసిన ఈ క్రియేటివ్ చిత్రానికి నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇది వేరే లెవెల్.. అంటూ విపుల్ ను ప్రశంసిస్తున్నారు.

ఇలాంటిది సాధ్యపడుతుందని ఎన్నడూ అనుకోలేదు : సోనూసూద్
విపుల్ చెక్కిన చిత్రంపై సోనూసూద్ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఇది ఆశ్చర్యాన్ని మించి ఉందని, ఇలాంటిది సాధ్యపడుతుందని ఎన్నడూ అనుకోలేదని ఆనందం వ్యక్తం చేశారు.

John Abraham : ఈ హీరో యాక్టింగ్‌తో పాటు బిజినెస్‌లో కూడా బెస్ట్..! కోట్ల రూపాయలకు అధిపతి..?

Salt in Diet: ఆహారంలో ఉప్పు ఎక్కువైతే ప్రమాదం.. మరి తక్కువైతే ఫర్వాలేదా? ఉప్పు తక్కువ తీసుకుంటే ఏం జరుగుతుంది.. తెలుసుకోండి!

Tokyo Olympics 2020 Live: కాసేపట్లో మహిళల డిస్కస్‌ త్రో ఫైనల్స్.. అథ్లెట్లో పతకం తెచ్చి.. భారతీయుల కల నెరవేర్చేనా

Loading...
Unable to load recommendations.
Follow Us