
తెలుగు సినిమాల్లో సువర్ణాక్షరాలతో లిఖించే సినిమా ఏది అంటే అందులో అన్నమయ్య ఖచ్చితంగా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకున్న సినిమా ఇది. కలియుగదైవం వేంకటేశ్వరస్వామి, అన్నమయ్య నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. అంతే కాదు ఈ సినిమాలో నాగార్జున అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. 1997లో విడుదలైన అన్నమయ్య చిత్రం తెలుగు సినిమా చరిత్రలో చెరిగిపోని ముద్రవేసుకుంది. దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు రూపొందించిన ఈ ఆధ్యాత్మిక చిత్రంలో కింగ్ నాగార్జున అన్నమయ్యగా, హీరో సుమన్ వెంకటేశ్వరస్వామిగా నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. నాగార్జున అన్నమయ్య సినిమా చేయడం అనేది అప్పట్లో పెద్ద సాహసం అనే చెప్పాలి.
అప్పట్లో నాగార్జున లవర్ బాయ్‌గా, యాక్షన్ హీరోగా దూసుకుపోతున్నారు. నిన్నేపెళ్లాడతా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవవడంతో నాగ్ క్రేజ్ డబుల్ అయ్యింది. ఆ సినిమాతో నాగార్జున లేడీ ఫ్యాన్స్ కూడా విపరీతంగా పెరిగిపోయారు. అలాంటి సమయంలో ఆయన అన్నమయ్య వంటి భక్తిరస చిత్రం చేయనున్నారని ప్రకటన రాగానే అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు ఆశ్చర్యపోయారు. అయితే, రాఘవేంద్రరావు పై ఉన్న నమ్మకంతో నాగార్జున విమర్శలను పట్టించుకోకుండా ఈ పాత్రను అంగీకరించారు.
అన్నమయ్య విడుదలైన తర్వాత సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అయితే అన్నమయ్యగా నాగార్జున ఓకే.. ఇక వెంకటేశ్వరస్వామిగా ఎవరు నటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాఘవేంద్రరావు మొదట సీనియర్ నటుడు శోభన్ బాబును సంప్రదించారట. అప్పట్లో సినిమాలు చేయకూడదని రిటైర్మెంట్ ప్రకటించిన శోభన్ బాబు, ఎక్కువ డిమాండ్ చేస్తే తనను వదిలేస్తారని రూ. 50లక్షలు డిమాండ్ చేసారట. ఆ రోజుల్లో ఇది చాలా పెద్ద మొత్తం కావడంతో, నిర్మాతలు ఆయనను పక్కన పెట్టారు. తరువాత, ఈ పాత్ర కోసం బాలకృష్ణను కూడా పరిశీలించారట. బాలకృష్ణకు ఉన్న స్టార్‌డమ్ దృష్ట్యా, ఆయన అభిమానులకు, నాగార్జున అభిమానుల మధ్య ఏదైనా క్లాష్ వస్తుందేమోనని ఆలోచించి సుమన్ ను ఎంపిక చేశారట. సుమన్‌ను వెంటనే పిలిపించి, మేకప్ టెస్ట్ చేసి, షూట్ చేశారు. ఆయన ఆ పాత్రకు కరెక్ట్‌గా సరిపోయారట. అక్కడి నుంచి సుమన్‌కు ఈ సినిమా ప్రయాణం ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వరస్వామి పాత్రలో సుమన్ నటనకు విశేష ప్రశంసలు లభించాయి.
Shoban Babu
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.