Sneha-Prasanna: సినిమాల్లోనే కాదు.. యాడ్స్‏లోనూ మేడ్ ఫర్ ఈచ్ అదర్.. స్నేహ దంపతులు ఎంత సంపాదించారో తెలుసా..

ప్రియమైన నీకు సినిమాతో టాలీవుడ్‏లోకి హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది స్నేహా. గ్లామర్ షో కోసం హద్దులు దాటకుండా.. సంప్రదాయంగా తెలుగింటి ఆడపడుచుల కనిపిస్తూ..

Sneha-Prasanna: సినిమాల్లోనే కాదు.. యాడ్స్‏లోనూ మేడ్ ఫర్ ఈచ్ అదర్.. స్నేహ దంపతులు ఎంత సంపాదించారో తెలుసా..
Sneha

Updated on: Jul 27, 2021 | 3:59 PM

ప్రియమైన నీకు సినిమాతో టాలీవుడ్‏లోకి హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది స్నేహా. గ్లామర్ షో కోసం హద్దులు దాటకుండా.. సంప్రదాయంగా తెలుగింటి ఆడపడుచుల కనిపిస్తూ.. తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గయ్యారు. గ్లామర్ షోలకు తావివ్వకుండా.. చీరకట్టుతో.. అందం అభినయంతో ఎంతో అభిమానులను సొంతం చేసుకున్నారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న స్నేహా .. ఆ తర్వాత టాలీవుడ్‏లో వరుస అవకాశాలను అందుకుంటూ కొన్నేళ్లపాటు టాప్ హీరోయిన్‍గా కొనసాగారు. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు స్నేహా. అలా తమిళంలో అచ్చాముందు అచ్చాముందు సినిమా షూటింగ్ సమయంలో కోలీవుడ్ హీరో ప్రసన్నతో ఏర్పడిన పరిచయం.. ఆ తర్వాత ప్రేమగా మారి.. 2012లో వివాహం చేసుకున్నారు స్నేహా. పెళ్లి తర్వాత కూడా స్నేహా సినిమాల్లో నటిస్తూ వచ్చింది.

Sneha Prasanna

అటు వీరిద్దరూ ఎవరి సినిమాల‏లో వారు బిజీగా ఉంటునే వాణిజ్య ప్రకటనలలోనూ కనివిందు చేశారు. కేవలం సినిమాలలోనే కాకుండా.. యాడ్స్‏లోనూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా ఈ జంట గుర్తింపు తెచ్చుకుంది. కేవడం ఒక్క యాడ్‍లోనే కాకుండా .. అనేక ప్రకటనలలోనూ ఈ జంట కలిసి నటించారు. స్నేహా, ప్రసన్న దంపతులకు అభిమానులు ఎక్కువ ఉండడం కూడా ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు. అలా వీరిద్దరూ కలిసి కేవలం యాడ్స్ చేస్తూనే రూ. 3.5 కోట్లు సంపాదించారని సమాచారం. అలాగే వీరిద్దరూ కలిసి ప్రకటనలలో ఎంతో డెడికేషన్‏తో నటిస్తారట. అందుకే వీరితో యాడ్స్ తీసేందుకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. యాడ్స్ ద్వారా ఎక్కువగా సంపాదిస్తున్న జంటలలో స్నేహా, ప్రసన్న జంట కూడా ఒకరు.

Also Read: TS Theaters: తెలంగాణలో సినిమా థియేటర్లలో టిక్కెట్ల ధరల పై హైకోర్టులో విచారణ..

Rajeev Kanakala: సుమతో విభేదాల రూమర్స్‏కు చెక్ పెట్టిన రాజీవ్ కనకాల.. నిజంగానే విడిగా ఉండాల్సి వచ్చిందంటూ..

Raj kundra: రాజ్ కుంద్రా కంపెనీపై గుజరాత్ షాప్ కీపర్ చీటింగ్ కేసు.. రూ. 3 లక్షలు నొక్కేశాడట !

Loading...
Unable to load recommendations.
Follow Us