
స్టార్ సింగర్ సునీత ఇప్పుడు బిజీ బిజీగా ఉంటోంది. ఓ వైపు సినిమా పాటలు పాడుతూనే టీవీ షోస్, ఓటీటీ షోస్ లో సందడి చేస్తోంది. అలాగే ప్రైవేట్ ఈవెంట్స్, కాన్సర్ట్స్ నిర్వహిస్తోంది. ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ తీరిక లేకుండా ఉంటోందీ స్టార్ సింగర్. అయితే ఇంత బిజీ వర్క్ లోనూ ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది సునీత. అది కూడా చాలా ఏళ్ల తర్వాత. ఈ ఇంటర్వ్యూలో సునీత పలు అంశాల గురించి మాట్లాడింది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే సినిమా ఇండస్ట్రీలని సమస్యలపై తన అభిప్రాయాలను పంచుకుంది. అయితే అమ్మాయిల వస్త్రధారణపై, క్యాస్టింగ్ కౌచ్ లపై సునీత చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. కాగా ఇదే ఇంటర్వ్యూలో తన ఆరోగ్యం గురించి ఓపెన్ గా మాట్లాడింది సునీత. చాలా ఏళ్లుగా తాను ఓ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిపి అందరికీ షాక్ ఇచ్చిందీ స్టార్ సింగర్.
‘నేను చాలా ఏళ్లుగా క్రాన్స్(Chronic Inflammatory Bowel Disease) అనే వ్యాధితో బాధపడుతున్నాను. నా జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు, వ్యక్తిగత ఇబ్బందుల వల్ల నేను చాలా ఏళ్ల పాటు డిప్రెషన్ లో ఉండిపోయా. ఆ బాధ తాలూకు ఎఫెక్ట్ నే ఈ క్రాన్స్ అనే ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది ప్రేగులకు సంబంధించిన అరుదైన వ్యాధి. ఇప్పటికీ నేను ఈ జబ్బుతో ఫైట్ చేస్తున్నాను. కొంచెం ఒత్తిడి పెరిగినా శరీరం అంతా విపరీతమైన నొప్పులు వస్తాయి’ అని సింగర్ సునీత చెప్పుకొచ్చింది.
క్రాన్స అనేది దీర్ఘకాలిక ప్రేగు వ్యాధి. దీని బారిన పడితే నోటి నుంచి పాయువు వరకు ఎక్కడైనా వాపు, చికాకు కలుగుతాయి. ఈ వ్యాధి వల్ల.. జీర్ణ సంబంధిత సమస్యల ఎక్కువగా వస్తాయి. అంటే విరేచనాలు, కడుపు నొప్పి, ఉబ్బరం, అలసట, జ్వరం, ఆకలి తగ్గడం.. ఇలా ప్రేగులకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. ఈ వ్యాధికి పూర్తి నివారణ లేకపోయినా సరైన ట్రీట్మెంట్, జీవన శైలిలో మార్పులు చేసుకుంటే ఈ వ్యాధి లక్షణాలను అదుపులో ఉంచుకోవచ్చని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.