సిల్క్ స్మిత.. వెండితెరపై వెలుగు జిలుగులు చిమ్మిన తార. 36 ఏళ్ళకే అర్ధాంతరంగా రాలిపోయిన సినీ సితార. ఆమె మనసులను ఆకర్షించే అయస్కాంతం. మత్తెక్కించే కళ్లు.. మైమరించినే మేని ఛాయ. ఐటమ్ గాళ్ మాత్రమే కాదు ఆమె లేడీ సూపర్ స్టార్. టాప్ హీరోలు సినిమాలు తీసి.. కూడా ఒక్క పాట చేయమని సిల్క్‌ను వెంటపడేవారు. విడుదలకు నోచుకోని సినిమాలకు.. ఆమె పాటే ప్రమోషన్. మత్తు కళ్ళతో.. కవ్వించే అందాలతో.. అప్పట్లో యువకులను చిత్తు చేసిన సిల్క్ స్మితది నిజజీవితంలో పసిపిల్ల మనస్తత్వం.
సిల్క్ స్మిత పూర్తి పేరు మీకు తెలుసా..? వడ్లపట్ల విజయలక్ష్మి. మన ఏలూరు తాలూకా అమ్మాయే. 1960 డిసెంబర్ 2న దెందులూరు మండలం కొవ్వలిలో ఆమె జన్మించారు. నాల్గవ తరగతి వరకే చదవుకున్నారు. పదిహేనేళ్ళకే ఆమెను ఒక అయ్య చేతిలో పెట్టేశారు తల్లిదండ్రులు. ఆమె భర్త, అత్తమామలు వేధింపులకు గురి చేయడంతో… ఇల్లు వదలి పారిపోయింది విజయలక్ష్మి. మద్రాస్ వచ్చి.. తొలుత టచప్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి.. చిన్నా చితకా పాత్రలు చేస్తోన్న ఆమెను.. మలయాళం డైరెక్టర్ ఆంథోనీ ఈస్ట్ మన్ ‘ఇనయే తేడి’ సినిమాలో హీరోయిన్ను చేశాడు. ఆ తరువాత ‘వండిచక్రం’ తమిళ సినిమాతో సిల్క్ స్మిత అయ్యింది. జ్యోతిలక్ష్మి, జయమాలిని ఇండస్ట్రీని శాసిస్తున్న ఆ రోజుల్లో దూసుకొచ్చి శృంగార రసాధిదేవతగా ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన కెరటం సిల్క్ స్మిత. తమిళ ప్రేక్షకులు ఆమెను సిల్క్ అనే పిలుస్తారు. అప్పటి టాప్ హీరోస్ అందరి చిత్రాలలోనూ సిల్క్ స్మిత ఆడిపాడింది. తెలుగుతో పాటు తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలోనూ సిల్క్ స్మిత సత్తా చాటింది.
అభిమాన నటీనటుల ఆటోగ్రాఫ్ తీసుకునే అలవాటుకు భిన్నంగా సిల్క్ స్మిత విషయంలో తమిళ ఫాన్స్ ప్రవర్తించేవారు. ఒక కిళ్ళీ తెచ్చుకొని ఆమెను కొరికి ఇమ్మని బతిమాలుకోవటం అప్పట్లో ఒక ట్రెండ్. 1984 లో ఒక సారి షూట్ బ్రేక్ లో యాపిల్ తింటూ ఉండగా షాట్ రెడీ అని పిలుపొచ్చింది. సగం కొరికిన యాపిల్ అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. ఆ కొరికిన యాపిల్‌ను ఆమె మేకప్ మన్ అక్కడికక్కడే వేలం వేస్తే సెట్లో ఉన్నవాళ్ళు పోటీపడి 26 వేలకు కొనుక్కోవటమంటే మాటలా… ?
వెండితెరపై ఓ వెలుగు వెలిగిన సిల్మ్ స్కిత్ 1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మరణంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆమె సూసైడ్ నోట్లో ఉన్న కంటెంట్.. మీ కోసం…