Shruti Haasan: కుంద‌న‌పు బొమ్మ‌.. చీర‌లో ఎంత అందంగా ఉన్నావ‌మ్మా..!

|

Jun 27, 2021 | 7:26 PM

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అనేది నిన్నటి మాట. సెలబ్రిటీలు మనసుపెడితే పోస్టులకు కొదవా అనేది ట్రెండీ మాట. యస్‌... సెలబ్రిటీలు... అందులోనూ...

Shruti Haasan: కుంద‌న‌పు బొమ్మ‌.. చీర‌లో ఎంత అందంగా ఉన్నావ‌మ్మా..!
Shruti Haasan
Follow us on

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అనేది నిన్నటి మాట. సెలబ్రిటీలు మనసుపెడితే పోస్టులకు కొదవా అనేది ట్రెండీ మాట. యస్‌… సెలబ్రిటీలు… అందులోనూ టాలెంటెడ్‌ బ్యూటీస్‌ తలచుకుంటే ఎన్ని పోస్టులైనా పెట్టుకోవచ్చు. శ్రుతిహాసన్‌ పెట్టిన నయా పోస్టు చూసి నెటిజన్లు అంటున్న మాటలివి.. సినిమాల కోసం మోడ్రన్‌ డ్రస్సుల్లో హల్‌చల్‌ చేసినా, ట్రెడిషనల్‌గా తయారవ్వడం నాకు చాలా ఇష్టం అని అంటున్నారు శ్రుతిహాసన్‌. అంతే కాదు, పక్కా పాపటి బిళ్లతో, జరీ అంచుతో ఉన్న చీరకట్టుకున్న ఫొటోను షేర్‌ చేశారు మన క్లాస్‌ కల్యాణి. శుక్రవారం అంటే నాట్‌ ఒన్లీ న్యూలీ రిలీజ్డ్ మూవీస్‌.. ద డే ఈజ్‌ ఆల్సో ఫర్‌ ట్రెడిషన్స్ అండ్‌ కస్టమ్స్ అన్నది ఈ కమల్‌ డాటర్‌ ఇంటెన్ష‌న్. ఇలాంటి ట్రెడిషనల్‌ లుక్‌లో రెడీ అయ్యి యుగాలు గడిచిపోతున్నాయి. క్యాజువల్‌ ప్యాంట్స్ తోనే రోజులు గడపాల్సి వస్తోంది. శుక్రవారం సందడిని గుర్తుచేసుకోవడానికే ఈ పిక్‌ని పోస్ట్ చేస్తున్నా అంటూ డిస్‌క్రైబ్‌ కూడా చేశారు శ్రుతి.

కాగా క్రాక్‌తో టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప‌క్కా మాస్ విజ‌యాన్ని అందుకుంది. మ‌రోసారి తెలుగు ఆడియెన్స్ లోక‌నాయ‌కుడి కూతురిని మ‌రోసారి ఓన్ చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్‌, విజయ్‌ సేతుపతితో లాభం సినిమాల్లో నటిస్తున్నారు శ్రుతి. ఈ ఏడాది లాభం విడుదలైనా, 2022లో మాత్రం సలార్‌తో ప్యాన్‌ ఇండియా సినిమా చూపించడానికి రెడీ అవుతున్నారు ఈ లేడీ రేసుగుర్రం.

Also Read: మెగాస్టార్‌ను మిస్ చేస‌కున్న సుజిత్.. ధ‌నుష్‌తో దుమ్ము రేపుతాడా..?

ఫ్యాన్‌ ఫాలోయింగ్ విషయంలో జట్‌ స్పీడుతో దూసుకుపోతున్న రష్మిక