10 కూడా పాస్ కాలేదు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్.. క్రేజ్ చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..

ప్రస్తుతం ఆమె తోపు హీరోయిన్. కానీ ఆ నటి 10వ తరగతి కూడా పాస్ అవ్వలేదు. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.25 కోట్ల పారితోషికం తీసుకుంటుంది. అంతేకాదు.. రూ. 200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని సమాచారం. తన మేకప్ బ్రాండ్ ద్వారా ఏడాదికి రూ.100 కోట్ల వ్యాపారం చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

10 కూడా పాస్ కాలేదు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్.. క్రేజ్ చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..
Katrina Kaif

Updated on: Jul 02, 2026 | 10:28 AM

సినిమా పరిశ్రమలో నటీనటులుగా దశాబ్దాల పాటు రాణించడం సర్వసాధారణం కాదు. ఎందుకంటే నిరంతరం అవకాశాలు రావడం చాలా కష్టం. అలాగే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం కూడా అంతే కష్టం. ఇక హీరోయిన్లు తమ క్రేజ్ కాపాడుకోవడం సవాళ్లతో కూడుకున్న పని. నిజానికి చాలా మంది హీరోయిన్లకు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే సామర్థ్యం ఉంటుంది. కొందరు చిన్న వయసులోనే పరిశ్రమలోకి ప్రవేశించి తమ విజయాన్ని కొనసాగిస్తారు. ఈ రోజుకి కూడా, కొంతమంది నటీమణులు పెద్దగా చదువుకోకపోయినా, స్టార్ సెలబ్రిటీలుగా ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. ఇప్పుడు అలాంటి హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం. ఆమె అంతగా చదువుకోకపోయినా, ఇండస్ట్రీలో స్టార్‌గా ఎదిగింది. ఈ స్టార్ హీరోయిన్ 10వ తరగతి కూడా పాస్ అవ్వలేదు, కానీ ఆమె పారితోషికం ఒక్కటే 25 కోట్ల రూపాయలు. ఇక ఆస్తుల విషయానికి వస్తే, ఆమె 200 కోట్లకు పైగా సంపాదించింది. మొత్తాని ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చింది. ఆమె ఎంతో మంది సినీ ప్రేమికులకు ఇష్టమైన నటి ఆమె మరెవరో కాదండి.. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె తోపు హీరోయిన్. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆమె.. యంగ్ హీరో విక్కీ కౌశల్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. హిందీలోనే కాకుండా టాలీవుడ్‌లో కూడా రెండు సినిమాలు చేసిన కత్రినా, తన కెరీర్ ఆరంభంలో వెంకటేష్, బాలకృష్ణల సరసన నటించింది. మొదట, వెంకటేష్ చిత్రం ‘మల్లీశ్వరి’తో ఆమె సూపర్ హిట్ అందుకుంది, ఆ తర్వాత బాలకృష్ణతో ‘అల్లరి పిడుగు’ చిత్రంలో నటించింది. కానీ ఆ రెండో సినిమా ఫ్లాప్ అవ్వడంతో, ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఇప్పుడు కత్రినా ఎడ్యుకేషన్ గురించి తెగ వైరలవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Arundhati Movie: అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాను.. అతడు మాటలు విని వదిలేశా.. టాలీవుడ్ హీరోయిన్..

నటి కత్రినా కైఫ్ చిన్నప్పుడు పాఠశాలకు వెళ్ళలేదు. కత్రినా తల్లిదండ్రులు నిరంతరం వేర్వేరు ప్రదేశాలకు మారుతూ ఉండటంతో ఆమె పాఠశాల తరచూ మారాల్సి వచ్చింది. ఇంటి వద్దనే విద్యను అభ్యసించిన కత్రినా, ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. కత్రినా తండ్రి కాశ్మీరీ ముస్లిం కాగా, ఆమె తల్లి బ్రిటిష్ సంతతికి చెందినవారు. హాంకాంగ్‌లో జన్మించిన కత్రినా, ఇంగ్లాండ్‌లో పెరిగారు. 14 ఏళ్ల వయసులో మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన ఈ నటి, ఆ తర్వాత సినిమా రంగంలో బిజీగా ఉన్నారు. సినిమా, బ్రాండ్ ప్రకటనలు, వ్యాపారం ఆమెకు ఆదాయ వనరులు కాగా, ఇప్పుడు సినిమాలకుగాను ఆమె 10-20 కోట్ల రూపాయలు అందుకుంటున్నారు. 2019లో తన సొంత మేకప్ బ్రాండ్‌ను ప్రారంభించిన కత్రినా, సంవత్సరానికి 100 కోట్లకు పైగా వ్యాపారం చేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..

కత్రినా కైఫ్..

Katrina Kaif Latest

ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఇంట్లోకి వెళ్లగానే సావిత్రిగారిని అలా చూసి ఏడ్చేశా.. మనిషి చిన్నగా అయిపోయి.. టాలీవుడ్ నటి కామెంట్స్..

Follow Us