Jailer 2: రజనీకాంత్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో.. లీక్​ చేసిన సీనియర్ స్టార్! చెప్పిందెవరు? చేస్తుందెవరు?

దక్షిణాది సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన సినిమాల్లో 'జైలర్' ఒకటి. సూపర్ స్టార్ రజనీకాంత్ మార్క్ మాస్ ఎలిమెంట్స్, నెల్సన్ దిలీప్ కుమార్ టేకింగ్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఆ సినిమాలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ ..

Jailer 2: రజనీకాంత్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో.. లీక్​ చేసిన సీనియర్ స్టార్! చెప్పిందెవరు? చేస్తుందెవరు?
Jailer 2

Updated on: Dec 26, 2025 | 6:15 AM

దక్షిణాది సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన సినిమాల్లో ‘జైలర్’ ఒకటి. సూపర్ స్టార్ రజనీకాంత్ మార్క్ మాస్ ఎలిమెంట్స్, నెల్సన్ దిలీప్ కుమార్ టేకింగ్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఆ సినిమాలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ వంటి దిగ్గజ నటుల మెరుపులు సినిమా స్థాయిని పెంచేశాయి. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా రాబోతున్న ‘జైలర్ 2’ గురించి ఒక అదిరిపోయే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సీక్వెల్ లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్ చేయబోతున్నారట. ఈ భారీ మల్టీస్టారర్ గురించి ఒక సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో సెన్సేషన్ గా మారాయి.

జైలర్ మొదటి భాగంలో ఇతర భాషల స్టార్ హీరోలైన శివరాజ్​కుమార్​, మోహన్​లాల్​ను ఎలాగైతే ఎఫెక్టివ్ గా చూపించారో, పార్ట్ 2 కోసం అంతకంటే భారీ ప్లాన్ సిద్ధం చేశారు నెల్సన్. షారుఖ్ ఖాన్ వంటి గ్లోబల్ స్టార్ రజనీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే అది కేవలం సినిమా మాత్రమే కాదు, బాక్సాఫీస్ దగ్గర ఒక ప్రభంజనం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సదరు సీనియర్ నటుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జైలర్ 2లో షారుఖ్ ఖాన్ పాత్ర ఎంతో కీలకంగా ఉండబోతోందని, ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు ముగిశాయని హింట్ ఇచ్చారు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అటు రజనీ ఫ్యాన్స్, ఇటు షారుఖ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

కేవలం షారుఖ్ ఖాన్ మాత్రమే కాకుండా, ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి మరికొంతమంది ప్రముఖ నటులు కూడా కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. రజనీకాంత్ పోషించిన ముత్తువేల్ పాండియన్ పాత్ర చుట్టూ ఈసారి కథ మరింత గంభీరంగా, అంతర్జాతీయ నేపథ్యంలో సాగనుందని సమాచారం. నెల్సన్ దిలీప్ కుమార్ ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేశారని, త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనుందని తెలుస్తోంది.

Shah Rukh Rajni Chakravarthy

అజిత్ తో సినిమా పూర్తి చేసిన తర్వాత రజనీకాంత్ పూర్తి స్థాయిలో జైలర్ 2 పైనే దృష్టి పెట్టనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ కుదిరితే ఇండియన్ సినిమా రికార్డులన్నీ తిరగరాయడం ఖాయం. ఒకవైపు తలైవా మాస్ ఇమేజ్, మరోవైపు కింగ్ ఖాన్ చరిష్మా ఒకే ఫ్రేమ్‌లో చూడటం ప్రేక్షకులకు కనువిందుగా ఉంటుంది.

ఈ సెన్సేషనల్ అప్‌డేట్‌ను బయటపెట్టిన ఆ నటుడు మరెవరో కాదు.. బాలీవుడ్ డిస్కో కింగ్ మిథున్ చక్రవర్తి! ఆయన కూడా ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో ‘రా-వన్’ సినిమాలో రజనీకాంత్ ఒక చిన్న పాత్రలో మెరిశారు, ఇప్పుడు షారుఖ్ ఖాన్ రజనీ సినిమాలో కనిపించబోతుండటం విశేషం. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. మొత్తానికి జైలర్ 2 తో బాక్సాఫీస్ వద్ద మరోసారి మ్యాజిక్ రిపీట్ అవ్వడం గ్యారెంటీ అనిపిస్తోంది.