కళ్లతోనే మాయ చేసిన అలనాటి నటి.. అందం, అభినయం కలబోసిన ఈ సీతాకోకచిలుక ఎవరో గుర్తు పట్టండి చూద్దాం..

ఆమె కన్నులు కలువ పూలు.. అందం, అభినయం కలబోసిన అచ్చ తెలుగు అమ్మాయి. తొలి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ భారతీరాజా సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

కళ్లతోనే మాయ చేసిన అలనాటి నటి.. అందం, అభినయం కలబోసిన ఈ సీతాకోకచిలుక ఎవరో గుర్తు పట్టండి చూద్దాం..

Updated on: Feb 15, 2022 | 12:11 PM

ఆమె కన్నులు కలువ పూలు.. అందం, అభినయం కలబోసిన అచ్చ తెలుగు అమ్మాయి. తొలి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ భారతీరాజా సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. భారతీరాజా తెరకెక్కించిన ఆ మూవీ అప్పట్లో సూపర్ హిట్. ఒక్కసారిగా ఆ హీరోయిన్ క్రేజ్ మారిపోయింది. తెలుగులో వరుస అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. అలా పదేళ్లపాటు టాప్ హీరోయిన్‎గా కెరీర్ కొనసాగించింది. తెలుగుతోపాటు.. తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 70 సినిమాల వరకు చేసి నటనతో సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. పైన ఫోటోలో ఉన్న ఆ అలనాటి ఎవరో గుర్తుపట్టగలరా..

తను మరెవరో కాదు.. కలువ కళ్లతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన తెలుగమ్మాయి ముచ్చెర్ల అరుణ. 1981లో ప్రముఖ దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన సీతాకోక చిలుక సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఒక్కసారిగా అరుణ్ క్రేజ్ మారిపోయింది. ఈ సినిమాతో అరుణ ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస చిత్రాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

Mucherla Aruna

చంటబ్బాయి, స్వర్ణకమలం, సంసారం ఒక చదరంగం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. పదేళ్ల కెరీయర్‏లో దాదాపు 70 పైగా చిత్రాల్లో నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ప్రముఖ వ్యాపారవెత్త మోహన్ గుప్తాను వివాహం చేసుకుంది. వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉంటోంది అరుణ. ఇటీవల సోషల్ మీడియాలో ఖాతా ఓపెన్ చేసి వర్కవుట్స్, వంటకాలు.. ఫిట్ నెస్ టిప్స్ చెబుతు యాక్టివ్ గా ఉంటుంది.

Also Read: Shanmukh Jashwanth: దీప్తితో బ్రేకప్ పై షణ్ముఖ్ షాకింగ్ కామెంట్స్.. అసలు కారణం ఇదే అంటూ..

Megha Akash: కూతురు సినిమా కోసం తల్లి మరో సాహసం.. ప్రొడ్యూసర్‏గా మారిన హీరోయిన్ మేఘ ఆకాష్ మథర్..

Siddu Jonnalagadda: ప్రేక్షకుల ఆనందోత్సాహాల నడుమ సందడి చేసిన ‘డిజె టిల్లు’ టీమ్.. సిద్ధు జొన్నలగడ్డ కామెంట్స్ వైరల్..

Aadavaallu Meeku Johaarlu: ఓ మై ఆద్యా పాటకు భారీ రెస్పాన్స్.. శర్వా, రష్మిక వాలెంటైన్స్ ట్రీట్..