Rajasekhar: విలన్‌‌‌‌గా మారనున్న సీనియర్ యాక్టర్.. ఆ హీరో సినిమాలో ప్రతినాయకుడిగా రాజశేఖర్..

|

Aug 06, 2021 | 7:39 PM

తెలుగు తెరపై అటు యాక్షన్ హీరోగాను .. ఇటు ఫ్యామిలీ హీరోగాను పేరు తెచ్చుకున్న అతి తక్కువమంది కథానాయకులలో రాజశేఖర్

Rajasekhar: విలన్‌‌‌‌గా మారనున్న సీనియర్ యాక్టర్.. ఆ హీరో సినిమాలో ప్రతినాయకుడిగా రాజశేఖర్..
Rajasekhar
Follow us on

Rajasekhar: తెలుగు తెరపై అటు యాక్షన్ హీరోగాను.. ఇటు ఫ్యామిలీ హీరోగాను పేరు తెచ్చుకున్న అతి తక్కువమంది కథానాయకులలో రాజశేఖర్ ఒకరుగా కనిపిస్తారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలు చేయాలంటే, రాజశేఖర్ తరువాతనే ఎవరైనా అనే పేరు తెచ్చుకున్నారు. రొమాంటిక్ హీరోగాను సాధించిన సక్సెస్‌‌‌లు ఆయన ఖాతాలో కనిస్తాయి.అలాంటి రాజశేఖర్ కొంత కాలంగా హీరోగా హిట్ల విషయంలో వెనుకబడ్డారు. అప్పటి నుంచే ఆయన విలన్ పాత్రల వైపు టర్న్ తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. కొన్ని ప్రాజెక్టుల విషయంలో చర్చలు జరిగినప్పటికీ అవి వర్కౌట్ కాలేదు. అందువలన ఒక వైపున హీరోగా చేస్తూనే, విలన్‌‌‌గా సరైన సినిమా చేసే సమయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో తన తాజా చిత్రం కోసం దర్శకుడు శ్రీవాస్.. రాజశేఖర్‌‌‌‌ను కలిసినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. గోపీచంద్ హీరోగా ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్న శ్రీవాస్, విలన్ పాత్ర కోసం రాజశేఖర్‌‌‌‌తో సంప్రదింపులు జరిపినట్టుగా చెప్పుకుంటున్నారు. రాజశేఖర్ సుముఖతను వ్యక్తం చేసినట్టుగానే ప్రచారం జరుగుతోంది. జగపతిబాబు.. శ్రీకాంత్ తరువాత, రాజశేఖర్ కూడా విలన్ పాత్రల వైపు అడుగులు వేస్తున్నారన్న మాట.

మరిన్ని ఇక్కడ చదవండి : 

పరమ్ సుందరి అంటూ అదరగొట్టిన చిన్నారి.. కృతిసనన్‌‌‌‌ను దించేసిన క్యూటీ.. నెటిజన్లు ఫిదా అవ్వకుండా ఉంటరామరి..

Tuck Jagadish: మళ్లీ ఓటీటీ వైపు టక్ జగదీశ్ చూపు..!! థియేటర్లు ఓపెన్‌ అయినా అంతగా కనిపించని జనం.. వీడియో

Mahesh Babu: నయా లుక్‌‌‌‌లో కనిపించిన సూపర్ స్టార్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫ్యాన్స్..