Samantha: విడాకుల తర్వాత తొలిసారి నాగచైతన్య ఫోటో షేర్ చేసిన సమంత.. ఎందుకంటే..

తెలుగు చిత్రపరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్‏గా పేరు తెచ్చుకున్నారు నాగచైతన్య (Naga Chaitanya), సమంత (Samantha).

Samantha: విడాకుల తర్వాత తొలిసారి నాగచైతన్య ఫోటో షేర్ చేసిన సమంత.. ఎందుకంటే..
Sam

Updated on: Apr 06, 2022 | 6:25 AM

తెలుగు చిత్రపరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్‏గా పేరు తెచ్చుకున్నారు నాగచైతన్య (Naga Chaitanya), సమంత (Samantha). ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట తమ నాలుగేళ్ల వివాహ బంధానికి గతేడాది అక్టోబర్‏లో ముగింపు పలికిన సంగతి తెలిసిందే. అనుహ్యంగా ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో సెలబ్రెటీలు, ఫ్యాన్స్ అంతా షాకయ్యారు. వీరిద్దరు విడిపోయి 6 నెలలు కావోస్తున్న ఎందుకు విడిపోయారనేది మాత్రం ఇప్పటివరకు స్పష్టత లేదు. విడాకుల ప్రకటన అనంతరం సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. మై మామ్ సెడ్ అనే హ్యాష్‎ట్యాగ్స్ షేర్ చేస్తూ వచ్చింది. అంతేకాకుండా తిరిగి సినిమాలపై ఫోకస్ చేస్తూ.. వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ.. తిరిగి బిజీ షెడ్యూ్ల్ గడిపేస్తుంది.

అయితే విడాకుల అనంతరం తొలిసారి సమంత నాగచైతన్య ఫోటోను షేర్ చేసింది. చైతూ.. సామ్ కలిసి నటించిన అందమైన ప్రేమకథా చిత్రం మజిలీ సినిమా 3 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్బంగా 3 ఇయర్స్ ఆఫ్ మజిలీ అంటూ మజిలీ సినిమా పోస్టర్ షేర్ చేసింది. విడాకుల తర్వాత సామ్ మొదటి సారి చైతూ పోస్టర్ షేర్ చేయడంతో.. కాసేపటికే నెట్టింట్లో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం సమంత యశోద సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తుండగా.. హరి, హరీష్ ఈ మూవీతో దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని ఆగస్ట్ 12న విడుదల చేయనున్నట్లు ఇటీవలే చిత్రయూనిట్ ప్రకటించింది. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ కీలకపాత్రలో నటిస్తున్నారు.

Samantha

Also Read: Rashmi Gautam: యాంకరమ్మ అందాలకు క్లీన్ బౌల్డ్ అవుతున్న ఫాన్స్.. రష్మీ లేటెస్ట్ ఇమేజెస్

Rashmika Mandanna: బంపర్ ఆఫర్ అందుకున్న శ్రీవల్లి.. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో..

Samantha-Yashoda: యశోద సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..

Beast: బీస్ట్ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. పవర్‏పుల్ యాక్షన్‏తో అదరగొట్టిన విజయ్ దళపతి..

Follow Us