Samantha : బేబీ బంప్‏తో సమంత వర్కౌట్స్.. జూన్ జ్ఞాపకాలను పంచుకున్న సామ్.. వీడియో వైరల్..

ఇటీవలే మా ఇంటి బంగారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది సమంత. ముఖ్యంగా ఈ మూవీలో సామ్ యాక్షన్ సీన్స్ పై విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓవైపు థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది ఈ మూవీ. అలాగే ఇదే సినిమా థాంక్స్ మీట్ లో తాను ప్రెగ్నెంట్ అని.. ఇకపై కొన్ని డేస్ మెటర్నటీ లీవ్స్ తీసుకుంటానంటూ చెప్పుకొచ్చింది సామ్. దీంతో ఆమెకు సినీ తారలు, అభిమానులు కంగ్రాట్స్ చెప్పారు.

Samantha : బేబీ బంప్‏తో సమంత వర్కౌట్స్.. జూన్ జ్ఞాపకాలను పంచుకున్న సామ్.. వీడియో వైరల్..
Samantha

Updated on: Jul 03, 2026 | 12:17 PM

టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం డబుల్ హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సామ్.. ఇటీవలే మా ఇంటి బంగారం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ మూవీ సామ్ యాక్టింగ్, యాక్షన్ సీన్లలో ఆమె పర్ఫార్మెన్స్ చూసి ప్రశంసలు కురిపించారు మేకర్స్. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సామ్ తన పర్సనల్ లైఫ్ లో మధురమైన దశను ఆస్వాదిస్తుంది. ఓవైపు ఫిల్మ్ కెరీర్ సక్సెస్ కాగా.. త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందనుంది. గతేడాది బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును వివాహం చేసుకుంది సామ్. ప్రస్తుతం తాను ప్రెగ్నెంట్ అని.. కొన్ని రోజులు మెటర్నటీ లీవ్స్ తీసుకుని సినిమాలకు దూరంగా ఉండనున్నట్లు వెల్లడించింది. ఇటీవలే బేబీ బంప్ ఫోటోస్ షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. తాజాగా బేబీ బంప్ తో వర్కౌట్స్ చేస్తున్న ఫోటోస్ పంచుకుంది సామ్. జూన్ నెల జ్ఞాపకాలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..

ఫిట్నెస్ విషయంలో సమంత ఎంత జాగ్రత్తగా, శ్రద్దగా ఉంటారో చెప్పక్కర్లేదు. మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సమయంలోనూ హెవీ వర్కవుట్స్ షేర్ చేసింది. ఇక ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న ఈ ప్రత్యేక సమయంలోనూ ఫిట్నెస్ పై శ్రద్ద వహిస్తూ హెవీ వర్కవుట్స్ చేస్తుంది. తాజాగా జూన్ నలెకు సంబంధించిన తన జ్ఞాపకాల ఫోటో డంప్ ఇన్ స్టాలో షేర్ చేసింది. అందులో తను వర్కవుట్స్ చేస్తున్న వీడియోను సైతం పంచుకుంది. అందులో అప్పర్ బాడీకి సంబంధించిన వర్కవుట్స్ చేస్తుంది. ఒక రాడ్ కు క్టిటన బలమైన తాడు సహాయంతో వ్యాయమం చేస్తూ కనిపించింది. ప్రస్తుతం సామ్ వయసు 39 సంవత్సరాలు.

ఎక్కువ మంది చదివినవి : Arundhati Movie: అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాను.. అతడు మాటలు విని వదిలేశా.. టాలీవుడ్ హీరోయిన్..

మా ఇంటి బంగారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సామ్.. అంతకు ముందు శుభం మూవీతో నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు. ఇదిలా ఉంటే.. బేబీ బంప్ తో సామ్ వ్యాయమాలు చేయడం చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. లవ్ యూ సామ్.. మీ చిన్నారిని చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..

సమంత వర్కవుట్ పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఇంట్లోకి వెళ్లగానే సావిత్రిగారిని అలా చూసి ఏడ్చేశా.. మనిషి చిన్నగా అయిపోయి.. టాలీవుడ్ నటి కామెంట్స్..

Follow Us