Samantha: సోషల్ మీడియాలో సమంత సెన్సేషన్.. అమ్మడి క్రేజ్ మాములుగా లేదుగా..

|

Dec 03, 2021 | 8:35 AM

సమంత.. ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏం మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ చిన్నది తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

Samantha: సోషల్ మీడియాలో సమంత సెన్సేషన్.. అమ్మడి క్రేజ్ మాములుగా లేదుగా..
Samantha
Follow us on

Samantha: సమంత.. ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏం మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ చిన్నది తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఆకట్టుకుంది ఈ భామ.. సమంత నటించిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఆతర్వాత తమిళ్ లోనూ ఈ బ్యూటీ ఆఫర్లు అందుకుంది. అక్కడ కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లోనూ సత్తా చాటాలని చూస్తుంది ఈ అమ్మడు. ఇప్పటికే ఫ్యామిలీ మెన్ సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది సమంత. ఈ వెబ్ సిరీస్ హిట్ అవ్వడంతో మరికొన్ని ఆఫర్స్ వస్తున్నాయి ఈ ముద్దుగుమ్మకు.

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో సమంత చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా అప్డేట్స్ ఇస్తూ అభిమానులను పలకరిస్తుంది సమంత. ఇక సమంత నిత్యం అందమైన ఫోటోలను షేర్ చేస్తూ సందడి చేస్తుంది. ఇక ఇటీవలే భర్త నాగచైతన్యతో  బంధాన్ని తెంపుకుంది సమంత.. చైతన్యకు దూరమైన తర్వాత సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. రకరకాల కొటేషన్స్ షేర్ చేస్తూ వస్తుంది. ఇక తాజా ఈ ముద్దుగుమ్మ రేర్ ఫీట్ ను అందుకుంది. సమంత ఇన్ స్టా లో ఏకంగా 20 మిలియన్ల ఫాలోవర్స్ ను దక్కించుకుంది. ఈ మధ్య కాలంలో ఈమె ఫాలోవర్స్ సంఖ్య అమాంతం పెరిగింది. సమంత ఫాలోవర్స్ సంఖ్య 20 మిలియన్ లకు చేరడంతో ఆమె యాడ్ పోస్ట్ రేటు భారీగా పెరుగుతుందట. ప్రస్తుతం తెలుగులో గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న శాకుంతలం సినిమాలో నటిస్తుంది ఈ వయ్యారి భామ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Gold Price Today: స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధరలు.. ఆ రెండు చోట్ల మాత్రం భారీగా తగ్గుదల.. ఒమిక్రాన్ భయాలతోనేనా?

Chiranjeevi: హైదరాబాద్‌లో ప్రారంభమైన మెగా154 షూటింగ్‌.. సెట్‌లో అడుగుపెట్టిన చిరంజీవి..

Akhanda Team – AMB Cinemas: అఖండ సక్సెస్.. బాలయ్య నోట అదిరిపోయే డైలాగ్.. వింటే గూస్‌బమ్స్ రావాల్సిందే..!