Krishna Vrinda Vihari: కృష్ణ వ్రింద విహారి ఫస్ట్ లిరికల్.. సమంత చేతుల మీదుగా వర్షంలో వెన్నెల సాంగ్..

|

Apr 10, 2022 | 6:25 AM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) ప్రస్తుతం ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం కృష్ణ వ్రింద విహారి (Krishna Vrinda Vihari).

Krishna Vrinda Vihari: కృష్ణ వ్రింద విహారి ఫస్ట్ లిరికల్..  సమంత చేతుల మీదుగా వర్షంలో వెన్నెల సాంగ్..
Naga Shaurya
Follow us on

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) ప్రస్తుతం ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం కృష్ణ వ్రింద విహారి (Krishna Vrinda Vihari). ఈ చిత్రానికి అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. నాగశౌర్య సరసన షిర్లీ సెటియా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ’ మ్యూజికల్ జర్నీ గ్రాండ్ గా మొదలైయింది. ఈ చిత్రంలోని మొదటి పాట ‘వర్షంలో వెన్నెల’ని సౌత్ క్వీన్ సమంత విడుదల చేశారు. మహతి స్వరసాగర్ స్వరపరిచిన ఈ పాట ప్రేక్షకులని అలరిస్తుంది. ఈ పాటలో నాగ శౌర్య, షిర్లీ సెటియా మధ్య కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంది. పాటని కూల్ అండ్ రొమాంటిక్ గా చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటుంది.

హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీతో పాటు పాటలో విజువల్స్ చాలా లావిష్ గా వున్నాయి. శ్రీమణి అందించిన సాహిత్యం కూడా వర్షంలో వెన్నెలంతా హాయిగా వుంది. పాట ఇంటర్ల్యుడ్ లో వినిపించిన వీణ స్కోర్ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా వుంది. పాట పాడిన సంజన కల్మంజే, ఆదిత్య ఆర్కే ఇద్దరూ తమ వాయిస్ తో మెస్మరైజ్ చేశారు. ఈ పాటతో ‘కృష్ణ వ్రింద విహారి’ సంగీత ప్రయాణం గ్రాండ్ గా ప్రారంభమైయింది. డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తుండగా, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి సాయిశ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ రాధిక ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన ‘వర్షంలో వెన్నెల’ పాట సినిమాపై మరిన్ని అంచనాలని పెంచింది.

Also Read: Beast: మోతమోగిపోతున్న విజయ్ స్టిల్స్.. వైరల్ అవుతున్న బీస్ట్ మూవీ పోస్టర్స్..

Hari Hara Veera Mallu: పవన్‌ సినిమా నుంచి పవర్‌ ప్యాక్డ్‌ సర్‌ప్రైజ్‌.. అదిరిపోయిన యాక్షన్‌ సీక్వెన్స్‌ షూట్ వీడియో..

Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఆచార్య ట్రైలర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌..

Dil Raju: పూజా మన కాజా.. ఆమె అడుగుపెడితే.. బుట్టబొమ్మను ఆకాశానికెత్తేసిన దిల్‌రాజు..