Kangana Ranaut -Samantha: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ హీరోయిన్స్ ట్వీట్స్.. కంగనా ను క్వీన్ అంటూ పొగిడిన సమంత..

బాలీవుడ్ లో కాంట్రవర్సీ క్వీన్ గా పేరుతెచ్చుకున్న కంగనా రనౌత్ నటిస్తున్న తాజా చిత్రం తలైవి. దివంగత నటి, రాజకీయనాయకురాలు జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అమ్మ పాత్రలో ఒదిగిపోయింది కంగనా.

Kangana Ranaut -Samantha: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ హీరోయిన్స్ ట్వీట్స్.. కంగనా ను క్వీన్ అంటూ పొగిడిన సమంత..
Samantha And Kangana Ranaut

Updated on: Apr 03, 2021 | 11:40 AM

Kangana Ranaut -Samantha: బాలీవుడ్ లో కాంట్రవర్సీ క్వీన్ గా పేరుతెచ్చుకున్న కంగనా రనౌత్ నటిస్తున్న తాజా చిత్రం తలైవి. దివంగత నటి, రాజకీయనాయకురాలు జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అమ్మ పాత్రలో ఒదిగిపోయింది కంగనా. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాను ఓ పాటను విడుదల చేశారు చిత్రయూనిట్. అయితే ఆ పాటను మూడు భాషల్లో రిలీజ్ చేయగా తెలుగులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లాంచ్ చేసింది. ట్విట్టర్ ద్వారా సమంత ఆ పాటను లాంచ్ చేసినందుకు గాను కంగనా కృతజ్ఞతలు తెలియజేసింది.

దానికి సమంత రీప్లే ఇచ్చింది. ‘మనం ఒకరిని ఒకరు సమర్థించుకుంటూ ప్రోత్సహించుకుంటూ మరింత శక్తివంతం అవ్వాలి అదే నిజమైన స్త్రీ వాదం’ అంటూ కంగనా సమంతకు కృతజ్ఞతలు తెలిపింది. దానిపై సమంత స్పందిస్తూ… కంగనా ట్వీట్ ను రీ ట్వీట్ చేసి క్వీన్ అంటూ హ్యాండ్స్ ఈమోజీలను షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఇద్దరి ట్వీట్స్  నెట్టింట వైరల్ అవుతున్నాయి. దర్శకుడు విజయ్ కి ఇలాంటి గొప్ప సినిమా తీసినందుకు అభినందనలు కూడా తెలియజేసింది సమంత. ఇక తలైవి సినిమా అన్ని భాషల్లో ఈనెల 23న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa Movie : ‘పుష్ప’నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్ .. అడవిలో బన్నీ మెరుపు పరుగు

Rashmika Mandanna: రష్మిక అదృష్టం మాములుగా లేదుగా ఏకంగా మెగాస్టార్ సినిమాలో ఛాన్స్..

‘వైల్డ్ డాగ్’ నాగార్జునకు వేడి వేడి డిన్నర్ చేసి పెట్టిన చిరంజీవి…!! ఏమని కామెంట్ చేశారో తెలుసా..? ( వీడియో )

Follow Us