ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు.. దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగినట్టుగానే రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండడంతో ఆర్ఆర్ఆర్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ప్రతి చిన్న అప్డేట్ వచ్చినా.. సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
ఇందులో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్.. హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అటు చరణ్, తారక్ సైతం ఈ మూవీ డబ్బింగ్ పనులు కూడా పూర్తిచేశారు. ఇక వచ్చే ఏడాది జనవరి 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈక్రమంలోనే ఈరోజు ఆరఆర్ఆర్ మూవీ నుంచి బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు మేకర్స్.
ఇదిలా ఉంటే.. ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించింది ఆర్ఆర్ఆర్. ఆర్ఆర్ఆర్ సినిమాతో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు రాజమౌళి. ఇండియాలో ఫస్ట్ టైం అతి పెద్ద మల్టీ ప్లేక్స్ చైన్ సిస్టం కలిగిన పీవీఆర్ సంస్థతో ట్రిపుల్ ఆర్ డీల్ కుదుర్చుకుంది.. ట్రిపుల్ ఆర్ సినిమాతో అసోసియేట్ అయింది పీవీఆర్ సినిమాస్. PVR సినిమాస్‌కి సంబంధించిన అన్ని మల్టీప్లెక్స్‌ల పేరు PVRRR గా మార్పు చేశారు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ వరకు PVR సినిమాస్ PVRRR గా కనపడనుంది. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదొక రికార్డ్ అని సినీ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
GET RRREADYYYY…. ??? #RRRMovie pic.twitter.com/WVobPkss2j
— RRR Movie (@RRRMovie) October 29, 2021
Visuals from PVR, Citimal, Andheri(W) ???#KomaramBheemNTR | #RRRMovie #ManOfMassesNTR | Jai NTR pic.twitter.com/oObNn4lMw7
— ??? ??? ?????????? ? (@NTRTheStalwart) October 29, 2021
Also Read: Anchor Anasuya: మంత్రి కేటీఆర్ సర్.. నాకో డౌట్ అంటూ ట్వీట్ చేసిన అనసూయ.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..
Kandikonda: క్యాన్సర్‌తో పొరాడుతున్న రచయిత కందికొండ.. సాయం చేసిన సింగర్ ..