
Rowdy Boys: కొత్త సినిమాలు.. కొత్త హీరోలు ప్రేక్షకులను ఈ మధ్య కాలంలో ఎక్కువగా పలకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల ముందుకు మరో యంగ్ టాలెంట్ రాబోతున్నాడు. ప్రొడ్యూసర్ శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా ఓ సినిమా రూపొందుతుంది. దిల్‌రాజు ప్రొడక్షన్.. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘రౌడీ బాయ్స్’ ఈ సినిమాకు శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్‌రాజు, శిరీష్ రౌడీ బాయ్స్ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగినట్లు ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నారు ఆశిష్. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేస్తున్నారు.
రౌడీ బాయ్స్కా లేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ‘రౌడీ బాయ్స్’ చిత్రాన్ని యూత్ సహా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించారని తెలుస్తుంది. మొదటి సినిమా అయినప్పటికీ ఫుల్ ఎనర్జీతో ఆశిష్ చేసిన డాన్సులు, ఫెర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకోనున్నాయి. ఈ సినిమాలో ఆశిష్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఇక మది సినిమాటోగ్రపీ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్‌గా నిలవనున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ , పాటలుప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. నేడు( శనివారం ) సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూ.ఎన్టీఆర్ హజరై ట్రైలర్ రిలీజ్ చేయించనున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
మరిన్ని ఇక్కడ చదవండి :