Roberrt Movie : ‘శబరి ముందు తలొంచడం తెలుసు.. రావణుడి తల తుంచడమూ తెలుసు’.. ఆకట్టుకుంటున్న ‘రాబర్ట్’ ట్రైలర్..

ఇటీవల కాలంలో ఎక్కడ చుసిన పాన్ ఇండియా సినిమాల హడావిడి కనిపిస్తుంది. తెలుగులో బాహుబలి సినిమా పాన్ ఇండియా రికార్డులు సృష్టించింది. ఏకంగా దేశాలు...

Roberrt Movie : ‘శబరి ముందు తలొంచడం తెలుసు.. రావణుడి తల తుంచడమూ తెలుసు’.. ఆకట్టుకుంటున్న రాబర్ట్ ట్రైలర్..

Updated on: Feb 16, 2021 | 3:05 PM

 

Roberrt Movie Trailer : ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన పాన్ ఇండియా సినిమాల హడావిడి కనిపిస్తుంది. తెలుగులో బాహుబలి సినిమా పాన్ ఇండియా మూవీగా  సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీకాదు. ఏకంగా దేశాలు దాటి వెళ్లి మరీ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన కన్నడ సినిమా కేజేఎఫ్ కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత చాలా కన్నడ సినిమాలు పాన్ ఇండియా మూవీలుగా తెరకెక్కాయి.ఈ సినిమాలకు  తెలుగులోకూడా మంచి మార్కెట్ ఉంది. ఈ క్రమంలో  తాజాగా మరో కన్నడ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

స్టార్ హీరో దర్శన్ నటించిన ‘రాబర్ట్’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్.. తరుణ్‌ కిశోర్‌ సుధీర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వినోద్‌ ప్రభాకర్‌, జగపతిబాబు, రవి శంకర్‌ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీలో ఆశాభట్‌ హీరోయిన్ గా నటిస్తుంది. దర్శన్ పుట్టిన రోజు కానుకగా విడుదలైన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. సమ్మర్ కానుకగా మర్చి 11న ఈ సినిమా విడుదల చేయనున్నారు.

రాబర్ట్ ట్రైలర్ …

 

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mohanlal: మోహన్‌లాల్… కంప్లీట్ యాక్టర్ ఎలా అయ్యారు..?.. సాలిడ్ ఆన్సర్ ఆయన మాటల్లోనే..

 

Loading...
Unable to load recommendations.
Follow Us