Cinema : ఏం సినిమా మావ.. క్లైమాక్స్ చూసి గుండె పగిలేలా ఏడ్చేశారు.. ఇప్పటికీ కన్నీళ్లు ఆగవు.. ఇంతకు మించిన లవ్ స్టోరీ లేదు..

ఒకప్పుడు యావత్ భారతీయ సినిమా ప్రపంచాన్ని కదిలించిన మూవీ. 141 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం చూస్తూ థియేటర్లలోనే జనాలు గుండె పగిలేలా ఏడ్చారు. ముఖ్యంగా క్లైమాక్స్ చూస్తూ వెక్కి వెక్కి ఏడ్చారు. ఆ ఒక్క సీన్ చూడడానికి అడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ?

Cinema : ఏం సినిమా మావ.. క్లైమాక్స్ చూసి గుండె పగిలేలా ఏడ్చేశారు.. ఇప్పటికీ కన్నీళ్లు ఆగవు.. ఇంతకు మించిన లవ్ స్టోరీ లేదు..
Vasantha Kokila

Updated on: Feb 23, 2026 | 6:46 PM

ప్రస్తుతం ఎన్నో ప్రేమకథ చిత్రాలు అడియన్స్ ముందుకు వస్తున్నాయి. ఎన్నో లవ్ స్టోరీస్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. కానీ దాదాపు 44 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ ప్రేమకథకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ సినిమా అప్పట్లో ప్రేక్షకులను గుండె పగిలేలా ఏడిపించింది. సినిమా చూస్తూ థియేటర్లలోనే జనాలు వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఈ 141 నిమిషాల సినిమా చరిత్ర సృష్టించింది. అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలోని ఒక్క సీన్ చూడటానికి మాత్రమే జనాలు థియేటర్లకు వచ్చారు. సౌత్ ఇండస్ట్రీ టూ నార్త్ వరకు రికార్డ్స్ కొల్లగొట్టింది. ఇప్పటికీ ఈ సినిమా వస్తే టీవీలకు అతుక్కుపోతుంటారు. ఈ చిత్రానికి బాలు మహేంద్ర దర్శకత్వం వహించారు. ఇందులో లోక నాయకుడు కమల్ హాసన్, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించారు. అలాగే గుల్షన్ గ్రోవర్, సిల్క్ స్మిత కీలకపాత్రలు పోషించారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‏ను ఊపేసిన ఫోక్ సాంగ్..

మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు వసంత కోకిల. నిజానికి ఈ చిత్రాన్ని తమిళంలో మూండ్రం పిరై పేరుతో తెరకెక్కించారు. కానీ తెలుగులో వసంత కోకిల పేరుతో రిలీజ్ చేశారు. ఈ చిత్రంలోని కథానాయిక శ్రీదేవి ఒక సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి. ఒక ప్రమాదం తర్వాత ఆమె మానసిక స్థితి పూర్తిగా మారిపోతుంది. చిన్న అమ్మాయిల ప్రవర్తిస్తుంది. ఆమె కదలికలు, అమాయకత్వం, చిన్నపిల్లల హావభావాలు చాలా సహజంగా ఉంటాయి. తన వాళ్ల నుంచి తప్పిపోయి సోము (కమల్ హాసన్ ) వద్దకు చేరుతుంది. ఆమెను ఒక వ్యభిచార గృహం నుండి రక్షించి తన ఇంటికి తీసుకువస్తాడు కమల్. తర్వాత ఆమెను చిన్న పిల్లల చూసుకుంటాడు.

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

తర్వాత నెమ్మదిగా ఆమె అమాయకత్వానికి ముగ్దుడై తనను ప్రాణంగా ప్రేమిస్తాడు. ఆమె ఆనందం కోసం అతను ప్రతిదీ త్యాగం చేస్తాడు. చివరకు ఆమె మానసిక స్థితి మెరుగుపడిన తర్వాత కమల్ జీవితంలో ఏం జరిగింది అనేది సినిమా. దాదాపు రూ. 1.2 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 2.1 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకు కమల్, శ్రీదేవి ఇద్దరూ ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు నామినేట్ అయ్యారు.

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..

Follow Us