RAW NTR: మా సేవలను నిలిపివేస్తున్నాం.. RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..

RAW ఎన్టీఆర్ సంచలన ప్రకటన చేసింది. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఈ టీమ్.. ఇప్పుడు తమ సేవలను నిలిపిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇందుకు గల కారణాలను వెల్లడించలేదు. కానీ తమ సేవలను నిలిపివేస్తున్నామని.. ఇందులో విజయం సాధించిన వాళ్ళందరికీ మా అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.

RAW NTR: మా సేవలను నిలిపివేస్తున్నాం.. RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..
Raw Ntr

Updated on: Jul 22, 2026 | 10:25 PM

RAW ఎన్టీఆర్ సంచలన ప్రకటన చేసింది. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఈ టీమ్.. ఇప్పుడు తమ సేవలను నిలిపిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇందుకు గల కారణాలను వెల్లడించలేదు. కానీ తమ సేవలను నిలిపివేస్తున్నామని.. ఇందులో విజయం సాధించిన వాళ్ళందరికీ మా అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

RAW ఎన్టీఆర్ సంస్థ వ్యవహారం ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ నుంచి ఊరు వాడా అనే కొత్త పోస్టర్ అధికారికంగా విడుదల కావడంతో ఒక్కసారిగా ఈ సంస్థ పేరు సంచలనంగా మారింది. దీంతో ఈ సంస్థ పై అనేక విమర్శలు వచ్చాయి. అయితే ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమకు తారక్ అంటే ఎంతో ప్రాణమని.. ఆయన కీర్తి ప్రతిష్టలకు ఎలాంటి భంగం వాటిల్లవ్వబోమని స్పష్టం చేశారు. కానీ తమను తారక్ కు దూరం చేయడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

తాము ఎప్పుడు ఎన్టీఆర్‌ను కలవాలని ప్రయత్నించినా, సదరు కోటరీ తమ ప్రయత్నాలను భగ్నం చేస్తోందని ఆర్గనైజర్స్ వాపోయారు. ఇదిలా ఉంటే ప్రెస్ మీట్ నిర్వహించిన నాలుగు రోజుల్లోనే తమ సేవలను నిలిపిస్తున్నట్లు ప్రకటించింది RAW ఎన్టీఆర్ సంస్థ.

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..

RAW ఎన్టీఆర్ ట్వీట్ :

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..

Follow Us