Raviteja: దసరా స్పెషల్ సర్‏ప్రైజ్.. రవితేజ ధమాకా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్..

|

Oct 15, 2021 | 11:30 AM

మాస్ మహారాజా జోరు పెంచాడు..ఈ ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ అనంతరం క్రాక్ సినిమాతో హిట్ కొట్టాడు మాస్ మహారాజా. చాలా కాలం

Raviteja: దసరా స్పెషల్ సర్‏ప్రైజ్.. రవితేజ ధమాకా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్..
Follow us on

మాస్ మహారాజా జోరు పెంచాడు..ఈ ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ అనంతరం క్రాక్ సినిమాతో హిట్ కొట్టాడు మాస్ మహారాజా. చాలా కాలం తర్వాత రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు… ఇక ఈ సినిమా అనంతరం రవితేజకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇక అదే జోష్ లో మాస్ హీరో సైతం వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ వీలైనంత త్వరగా షూటింగ్స్ స్టార్ట్ చేసేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ .. రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సస్పెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవిజేత ద్విపాత్రాభినయం చేస్తుండగా.. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నాడు. పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. రవితేజ.. డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన కాంబోలో ఓ మూవీ రాబోతుందని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో దసరా కానుకగా ఈ సినిమాకు సంబంధించిన అఫిషియల్ ప్రకటన ఇచ్చారు మేకర్స్. అంతేకాకుండా.. ఈ సినిమా టైటిల్ తోపాటు.. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. రవితేజ.. త్రినాథ్ రావు నక్కిన కలయికలో రాబోతున్న సినిమా ధమాకా.. ఇక ఇందులో పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీలా హీరోయిన్ గా నటించనున్నట్లుగా టాక్. ఇక ఈ సినిమానే కాకుండా.. రవితేజ.. శరత్ మండవా దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ధమాకాలో నటించే నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్వీట్..

Also Read: Sai Dharam Tej: దసరా పండుగ వేళ మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జ్

Ram Charan: రామ్ చరణ్ కొత్త ప్రాజెక్ట్ అప్డేట్ వచ్చేసింది.. ప్రకటించిన చిత్రయూనిట్…డైరెక్టర్ ఎవరంటే..