Ravi Teja Daughter: కూతురు మోక్షధ తో రవితేజ ఫోటో.. హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోని అందం అంటున్న ఫ్యాన్స్

Ravi Teja Daughter:మెగాస్టార్ చిరంజీవి తర్వాత టాలీవుడ్ లో స్వయం కృష్టితో ఎదిగిన హీరో ఎవరంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు.. రవితేజ. సినిమాల మీద ఇంట్రెస్ట్ తో చిత్ర పరిశ్రమలో..

Ravi Teja Daughter: కూతురు మోక్షధ తో రవితేజ ఫోటో.. హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోని అందం అంటున్న ఫ్యాన్స్
Ravi Teja Family

Updated on: Apr 10, 2021 | 3:52 PM

Ravi Teja Daughter:మెగాస్టార్ చిరంజీవి తర్వాత టాలీవుడ్ లో స్వయం కృష్టితో ఎదిగిన హీరో ఎవరంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు.. రవితేజ. సినిమాల మీద ఇంట్రెస్ట్ తో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాడు.. అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూనే తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నారు. నిన్నేపెళ్లాడతా వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే 1997 లో కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన సింధూరం మూవీలో బ్రహ్మాజీతో పాటు సెకండ్ హీరోగా నటించాడు. అల్లరి చంటిగా ఆకట్టుకున్నాడు. తర్వాత నీ కోసం సినిమాతో హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో రవితేజ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.

పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ సినిమాలతో హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తర్వాత అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, డాన్ సీను, కిక్, విక్రమార్కుడు , వరస విజయాలతో మాస్ మహారాజ గా గుర్తింపు సంపాదించుకున్నాడు.

Ravi Teja Daughter

అయితే ఎప్పడు రవితేజ ఫ్యామిలీ పెద్దగా బయట కనిపించేది తక్కువే అని చెప్పవచ్చు.. రవితేజ కి కళ్యాణి అనే అమ్మాయితో వివాహం 2002 లో జరిగింది. ఈ దంపతులకు ఒక కూతురు, కుమారుడు. కుమారుడు మహాధన్ రాజా ది గ్రేట్ సినిమాలో జూనియర్ రవితేజ గా నటించాడు. ఇక రవి తేజ కుమార్తె మోక్షాధ ఎప్పుడు అభిమానులకు పెద్దగా కనిపించింది లేదు.. అంతగా లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తుంటాడు.. అయితే తాజాగా రవితేజ తన కూతురు తో దిగిన ఫోటోలను రవితేజ పంచుకున్నాడు.ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. హీరోయిన్ అందానికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది మోక్షధ అంటున్నారు ఫ్యాన్స్

Also Read: మొసలిపై దాడి చేసిన గుర్రం.. తరిమి తరిమి కొట్టిన వైనం.. వీడియో వైరల్

దీప కండిషన్ సీరియస్.. సంతోషంలో మోనిత…. దీపని ఎలా కాపాడుకోవాలి అనే ఆలోచనలో కార్తీక్..

Follow Us