Rashmika Mandanna: జిమ్‌లో తగ్గేదేలే అంటోన్న శ్రీవల్లి.. రష్మిక వర్కవుట్ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

రష్మిక మందన (Rashmika Manadanna).. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటుందో తెలిసిన విషయమే. ఎప్పటికప్పుడు తన మూవీ అప్డేట్స్.. వ్యక్తిగత

Rashmika Mandanna: జిమ్‌లో తగ్గేదేలే అంటోన్న శ్రీవల్లి.. రష్మిక వర్కవుట్ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
Rashmika

Updated on: Mar 29, 2022 | 7:45 AM

రష్మిక మందన (Rashmika Manadanna).. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటుందో తెలిసిన విషయమే. ఎప్పటికప్పుడు తన మూవీ అప్డేట్స్.. వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫాలోవర్లను అట్రాక్ట్ చేసుకుంటుంది రష్మిక. నెట్టింట్లో ట్రెండ్ అయ్యే ప్రతి విషయంలోనూ ఆసక్తి చూపిస్తుంది. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ దావన్‏తో కలిసి అరబిక్ కుతూ పాటకు స్టెప్పులేసి అదరగొట్టి రష్మిక. ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఇప్పుడు ఫుల్ జోష్ మీదుంది. ఇటీవల పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. మరోవైపు బాలీవుడ్‏లోనూ సత్తా చాటుతోంది. బీటౌన్‏లో వరుస ఆఫర్లను అందుకుంటూ బిజీ బిజీగా గడిపేస్తుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో పుష్ప పార్ట్ 2, తమిళంలో కార్తీ సరసన ఓ ప్రాజెక్ట్.. బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు చిత్రాలు ఉన్నాయి. షూటింగ్ దశలో ఉన్న హిందీ చిత్రాలు త్వరలోనే పూర్తి కానున్నాయి. తాజాగా రష్మికకు సంబంధించిన జిమ్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

అందులో రష్మిక వర్కవుట్స్‏తో హడావిడి చేస్తోంది. ఎంతో యాక్టివ్‏గా తన ట్రైనర్ చెప్పే వర్కవుట్స్ చేసేస్తోంది. ఆమె జిమ్ వీడియో చూస్తే చూసేవారికి చెమటలు పట్టేలా ఉంది. కష్టమైన ఫిట్లను సైతం ఎంతో తెలికగా చేసుంది రష్మిక. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. రష్మిక వర్కవుట్స్ చూసి బాలీవుడ్ బ్యూటీ ఎల్లి అవ్రామ్ సైతం షాకయ్యింది.

Also Read: Dubai Expo 2020: ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, రణవీర్ సింగ్

Harish Shankar: హరీష్ శంకర్ అయితేనే బెటర్ అంటున్న మెగాస్టార్.. ఈమూవీ కోసం అంటే

Tollywood: ఇన్​స్టాలో ఒక్క పోస్ట్‌కు సమంత ఎంత తీసుకుంటుందో తెలిస్తే షాక్ తినాల్సిందే..!

S. Thaman : దేవీ శ్రీ పై క్రేజీ కామెంట్స్ చేసిన తమన్.. డార్లింగ్ బ్రదర్ అంటూ డీఎస్పీ ట్వీట్