Rashmika Mandanna : ఆ సినిమా షూటింగ్ కు పడ్డ కష్టం ఏ సినిమాకు పడలేదంటున్న లక్కీ బ్యూటీ..

టాలీవుడ్ టాప్‌ హీరోయిన్ కు తక్కువ చిన్న హీరోయిన్‌కు ఎక్కువగా ఉండే బ్యూటీ రష్మిక మందాన. ఇప్పుడు అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటోంది..

Rashmika Mandanna : ఆ సినిమా షూటింగ్ కు పడ్డ కష్టం ఏ సినిమాకు పడలేదంటున్న లక్కీ బ్యూటీ..

Updated on: Feb 11, 2021 | 2:32 AM

Rashmika Mandanna : టాలీవుడ్ టాప్‌ హీరోయిన్ కు తక్కువ చిన్న హీరోయిన్‌కు ఎక్కువగా ఉండే బ్యూటీ రష్మిక మందాన. ఇప్పుడు అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటోంది ఈ భామ. తెలుగు సినిమాల్లోనే కాకుండా ఇతర భాషల సినిమాల్లోనూ.. అవకాశాలు పట్టేసుకుంటూ మంచి మంచి ఆఫర్లతో దూసుకుపోతోంది.ఇక రష్మిక ఇప్పుడు అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాలోనూ నటిస్తోంది. సుకుమార్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో బన్నీకి జంటగా రష్మిక ఆడిపాడనుంది. అయితే రీసెంట్‌గా ‘పుష్ప’ చిత్రీకరణ‌ గురించి ఆ షూటింగ్లో పడుతున్న కష్టాల గురించి ఓ ఇంటర్య్వూలో చెప్పింది రష్మిక.

అల్లు అర్జున్‌తో కలిసి పనిచేయడం స్పెషల్‌గా ఉందని.. అతని నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని.. మనసుపరంగా బన్నీ చాలా చిన్న పిల్లాడని చెప్పింది. ఇక ఆన్‌స్క్రీన్‌లో  మా ఇద్దరి కెమిస్ట్రీ సూపర్గా వచ్చిందని తెగ మురిసిపోయింది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ‘‘ఇప్పటివరకూ నేను చేసిన చిత్రాల్లో ‘పుష్ప’ ఎంతో డిఫరెంట్‌ అని, ఫారెస్ట్ లాంటి ఏరియాల్లో, తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి లొకేషన్‌కు చేరుకోవడం.. తిరిగి రాత్రి 10 గంటలకు హోటళ్లకు చేరుకోవడం ఓ థ్రిల్లింగ్‌ ఎక్స్‌ పీరియన్స్‌ అని చెప్పింది. ఇక ఆ తరువాత భోజనం, వర్కౌట్లు చేసి నిద్రపోయేసరికి 12 నుంచి ఒంటిగంట అయ్యేదని.. దానివల్ల కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేవాళ్లమని చెప్పింది. తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు స్క్రీన్‌ పై చూస్తారు అని చెప్పింది రష్మిక. అంతేకాకుండా ఈ సినిమాలో హీరో హీరోయిన్స్‌ మేకప్‌ చాలా కీలకమైందని.. దీని కోసమే రెండు గంటలు కేటాయించాల్సి వస్తోందని పడుతున్న కష్టాన్ని చెప్పింది రష్మిక.

మరిన్ని ఇక్కడ చదవండి :

Seetimaarr Movie : శరవేగంగా గోపీచంద్ ‘సీటీమార్’ .. జైసల్మేర్‌ ఏడారిలో చిత్రయూనిట్..

 

Loading...
Unable to load recommendations.
Follow Us