Rashmika Mandanna: రష్కిక మందన తన నటనతోనే కాకుండా క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో.. అల్లరి పనులతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన రష్మిక.. విజయ్ దేవరకొండతో నటించిన ‘గీతా గోవిందం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత రష్మిక టాలీవుడ్లో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇటు తెలుగులోనే కాకుండా.. అటు తమిళం, హిందీ భాషలలో సైతం సినిమాలు చేస్తూ.. తీరిక లేకుండా గడుపుతోంది. తాజాగా ఈ అమ్మడు తన అభిమానులను తనను కాస్త మాట్లాడనివ్వండి అంటూ మొరపెట్టుకుంది.
ప్రస్తుతం రష్మిక తమిళ హీరో కార్తీకి జోడిగా ‘సుల్తాన్’ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఆ వేడుకలో పాల్గోన్న రష్మిక తన స్టైల్లో స్పీచ్ ఇచ్చి మరోసారి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ముంబైలో షూటింగ్ ఉన్నా కానీ.. అక్కడకు వెళ్లేందుకు ఆలస్యమవుతున్నా కూడా సుల్తాన్ ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చింది రష్మిక. దీంతో తొందరగా మాట్లాడి వెళ్ళిపోవాలనుకున్న రష్మిక ముందుగానే మైక్ తీసుకుంది. ఇక ఆ వెంటనే ఆమె అభిమానులు గోల గోల చేసారు.
స్పీచ్ మొదలు పెట్టడంతోనే అభిమానులను.. మాస్క్ ఏది.. సోషల్ డిస్టెన్స్ ఏది అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత కార్తీ గురించి.. సుల్తాన్ గురించి చెప్పుకోచ్చింది. నన్ను చెన్నైలో బాగా చూసుకున్నారు. మన హైదరాబాద్ గురించి గొప్పగా చెప్పాను. వారిని బాగా చూసుకోండి అంటూ చెప్పుకోచ్చింది. ఇక రష్మిక మాట్లాడుతున్న సమయంలో అభిమానులు సూర్య సూర్య అంటూ గోల చేశారు. అయితే వారిని అల్లరి చేయ్యేద్దని చెప్పుతున్న వినకపోవడంతో.. అరేయ్ నన్ను మాట్లాడనివ్వండిరా.. నాకు లేట్ అవుతుందిరా.. మళ్లీ వెళ్లాలి అంటూ తన అభిమానులను విజ్ఞప్తి చేసింది రష్మిక.