Dhurandhar 2: దురంధర్ 2 సినిమా రివ్యూ.. రణవీర్ సింగ్ విశ్వరూపం.. ఆదిత్య ధర్ యాక్షన్ విధ్వంసం..!

గతేడాది డిసెంబర్‌లో వచ్చిన 'దురంధర్' సృష్టించిన సునామీ గురించి తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా భారీ అంచనాలతో వచ్చిన చిత్రమే ఈ 'దురంధర్: ది రివెంజ్'. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.

Dhurandhar 2: దురంధర్ 2 సినిమా రివ్యూ.. రణవీర్ సింగ్ విశ్వరూపం.. ఆదిత్య ధర్ యాక్షన్ విధ్వంసం..!
Dhurandhar 2 Movie

Edited By:

Updated on: Mar 19, 2026 | 6:59 AM

నటీనటులు: రణవీర్ సింగ్, సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్, రాకేష్ బేడీ

దర్శకత్వం: ఆదిత్య ధర్

సంగీతం: శాశ్వత్ సచ్‌దేవ్

నిర్మాణ సంస్థలు: జియో స్టూడియోస్, B62 స్టూడియోస్

కథ:

పాకిస్తాన్లో రహమాన్ డెకాయిత్ (అక్షయ్ ఖన్నా) చనిపోయిన తర్వాత గ్యాంగ్ వార్ మరింత పెరిగిపోతుంది. అండర్‌ కవర్ ఏజెంట్‌గా పాకిస్థాన్‌లో చొరబడిన జస్కిరత్ సింగ్ అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాడు.. ఎవరు పంపించారు.. హంజా అలీ మజారిగా (రణవీర్ సింగ్) ఎందుకు మారాల్సి వచ్చింది అనేది ఈ సినిమా కథ. అక్కడికి వెళ్ళిన తర్వాత దావూద్ ఇబ్రహీం సిండికేట్‌ను, పాక్ రాజకీయాలను తన గుప్పిట్లోకి తీసుకుని, 26/11 ముంబై దాడులకు హంజా ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు..? ఈ క్రమంలో పాకిస్తాన్ లో ఒక బలమైన శక్తిగా ఎలా ఎదిగాడు..? పోలీస్ ఆఫీసర్ ఎస్పీ అస్లాం చౌదరి (సంజయ్ దత్), ఐబీ చీఫ్ అజయ్ సన్యాల్ (మాధవన్), మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) పాత్రలు హంజా మిషన్‌ను ఎలా మలుపు తిప్పాయి అన్నదే మిగతా స్టోరీ.

కథనం:

‘దురంధర్ 2’ కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, పాలిటిక్స్, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ కలగలిపిన ఒక మాస్టర్ క్లాస్. తొలి భాగంలో ‘రెహమాన్’ పాత్ర లేని లోటును ఎమోషనల్‌గా, ఆపరేషనల్‌గా ఈ సీక్వెల్ బ్రిలియంట్‌గా ఫిల్ చేసింది. కొత్త హీరోగా హంజా ఎంట్రీ సినిమాకు ప్రాణం పోసింది. ఒక రా హ్యాండ్లర్‌ను ఉత్కంఠభరితంగా మట్టుబెట్టే సన్నివేశంతో హంజా తన మార్క్ ఏంటో బలంగా చూపిస్తాడు. దేశ భద్రత కోసం చేసే పోరాటాన్ని అత్యంత సహజంగా, ధైర్యంగా దర్శకుడు ఆదిత్య ధర్ తెరమీదకు తీసుకొచ్చిన తీరు అద్భుతం. పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి.. ముఖ్యంగా పంజాబ్, యూపీ రాష్ట్రాల్లోకి డ్రగ్స్, టెర్రరిజం సప్లై చైన్ ఎలా నడుస్తుందనే కఠోర వాస్తవాలను ఈ సినిమా ధైర్యంగా ఎక్స్‌పోజ్ చేసింది. పంజాబ్‌లో ఖలిస్తానీ ప్లాన్, యూపీలో యువతను బ్రెయిన్ వాష్ చేసి వాళ్ల మూలాల నుంచి ఎలా దూరం చేస్తున్నారో చూపించిన తీరు ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తుంది. ఈ టెర్రర్ నెట్‌వర్క్‌ను హంజా ఒక్కొక్కటిగా దెబ్బతీస్తుంటే ఐఎస్ఐకి అతనిపై అనుమానం పెరగడం ఉత్కంఠభరితంగా మారుస్తుంది.
సరిగ్గా అదే సమయంలో హంజా రాసిన సీక్రెట్ డైరీని అతని భార్య చూడటం అనేది కథలోని పర్సనల్ ఎమోషన్‌ను, కాన్ఫ్లిక్ట్‌ను పీక్స్‌కి తీసుకెళ్తుంది. ఈ సినిమాలో వాస్తవ సంఘటనలను కథకు ముడిపెట్టిన విధానం చాలా స్మార్ట్‌గా ఉంది. ముఖ్యంగా ‘నోట్ల రద్దు’ ఫేక్ కరెన్సీ చలామణిని ఎలా దెబ్బకొట్టింది, ఇండియా ఆర్థిక బలం జాతీయ భద్రతను ఎలా బలోపేతం చేసిందనేది చాలా కన్విన్సింగ్‌గా చూపించారు. ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఏజెన్సీల టెక్నాలజీ, సైంటిఫిక్ కోఆర్డినేషన్ చాలా అథెంటిక్‌గా అనిపిస్తాయి. సాధారణ పౌరుల చిత్తశుద్ధిని, దేశభక్తిని సెలబ్రేట్ చేస్తూనే, జీవిత పోరాటంలో పట్టుదలకు ఇదొక పవర్‌ఫుల్ ట్రిబ్యూట్‌గా నిలుస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ కాస్త స్లోగా మొదలవుతుంది. అలాగే తొలి భాగంతో పోలిస్తే ఇందులో వయొలెన్స్, పాలిటిక్స్ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటాయి. కానీ ఫ్లాస్‌లెస్ డైరెక్షన్, నటీనటుల ఇంటెన్స్ పెర్ఫార్మెన్సెస్ ఆ చిన్న లోపాలను సులభంగా కవర్ చేసేస్తాయి. ఓవరాల్‌గా ఇదొక సాలిడ్ రివెంజ్ డ్రామా. దేశం కోసం చేసే పోరాటం ఎలా ఉంటుందో కళ్లకు కట్టే పవర్‌ఫుల్ ఎసెన్షియల్ సినిమా ఇది.

నటీనటులు:

ఇది పక్కా రణవీర్ సింగ్ వన్ మ్యాన్ షో. హంజా పాత్రలో రణవీర్ ‘బీస్ట్ మోడ్’ ఆన్ చేశాడు. ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్స్, యాక్షన్ సీక్వెన్సుల్లో తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎస్పీ అస్లాంగా సంజయ్ దత్ తన స్వాగ్‌తో అదరగొట్టగా.. ఐబీ చీఫ్‌గా మాధవన్, మేజర్‌గా అర్జున్ రాంపాల్ తమ సెటిల్డ్ యాక్టింగ్‌తో సినిమాకి మంచి డెప్త్ తీసుకొచ్చారు. సారా అర్జున్ నాచురల్ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించింది. మిగిలిన వాళ్ళు ఓకే..

టెక్నికల్ టీం:

శాశ్వత్ సచ్‌దేవ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వికష్ నౌలఖా సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రాణం పోశాయి. నిర్మాణ విలువలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. అయితే సినిమాలో బ్లడ్‌షెడ్, వయొలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక దర్శకుడు ఆదిత్య ధర్ పకడ్బందీ స్క్రీన్ ప్లే సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. సుమారు 3 గంటల 49 నిమిషాల భారీ రన్‌టైమ్ ఉన్నప్పటికీ, ఎక్కడా బోర్ కొట్టకుండా రేసీగా స్క్రీన్ ప్లే నడిపించిన విధానం అద్భుతం.

పంచ్ లైన్:

ఓవరాల్ గా దురంధర్ 2.. ఇది చరిత్ర.. జస్ట్ ఎక్స్పీరియన్స్..!

Follow Us