రణ్‌బీర్ కపూర్‌కి ఆలియా కటీఫ్ చెప్పిందో లేదో ఇంకా క్లారిటీ లేదు కానీ, మన స్వీటీ అనుష్క మీద రణ్‌బీర్ మనసు పడ్డారన్న మాటలు మాత్రం జెట్ స్పీడ్‌లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎవరూ ఎప్పుడూ ఊహించని ఈ పెయిర్ ఇప్పుడు సడెన్‌గా సీన్‌లోకి ఎందుకు వచ్చినట్టు..? ఆరా తీస్తే… అప్పుడెప్పుడో ఓ అవార్డుల ఫంక్షన్లో రణ్‌బీర్ చెప్పిన మాటల్ని గుర్తుచేసుకుంటున్నారు స్వీటీ ఫ్యాన్స్. అనుష్క ఒప్పుకోవాలే కానీ, నార్త్ హీరోలు కూడా ఆమెతో యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారన్నది వాళ్ల మాట. బాహుబలి సినిమా చూసిన తర్వాత ఆమె యాక్టింగ్‌కి ఫిదా అయ్యాయని, అవకాశం వస్తే ఆమెతో తప్పకుండా సినిమా చేయాలని ఉందని, ఆమె తన హార్ట్ త్రోబ్ అని మనసులో మాటల్ని బయట పెట్టేశారు కపూర్ వారసుడు.
సో ఇప్పటికైతే ఈ జంటతో జరిగే సినిమా గురించి ఎక్కడా టాపిక్కే లేదు. ఫ్యూచర్‌లో అయినా ఫ్యాన్స్ కోరిక మేర వెండితెర మీద ఈ జోడీని చూడగలమా? ఆ ముచ్చటేమో కానీ, ఈ లాక్‌డౌన్ టైమ్లో ఈ విధంగా మరోసారి వార్తల్లోకి వచ్చేశారు స్వీటీ. కాగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం ‘బ్రహ్మాస్త్రా’ తెరకెక్కుతుంది. ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్ హీరోగా శివ అనే పాత్రలో నటిస్తుండగా.. అక్కినేని నాగార్జున విష్ణు పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను మూడు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఇందులో ఏదో ఒక భాగంలో అనుష్క కూడా నటించే ఛాన్స్ ఉంది. దీంతో ఈ సినిమా ద్వారా తన క్రష్ అనుష్కతో కలిసి నటించి రణ్‌బీర్ తన కోరిక తీర్చుకోనున్నాడని బాలీవుడ్ టాక్
Also Read: ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ట్రైలర్ విడుదల.. ఉగ్రవాది పాత్రలో ఆకట్టుకున్న సమంత .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..