
టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ సినిమా సెట్లో ఉంటే ఆ సందడి వేరని.. సినీ జనం చెప్పే మాట. కేవలం మూవీ సెట్స్‌లో మాత్రమే కాదు.. ఏవైనా ఆడియో ఫంక్షన్స్, టీవీ షోస్, ఇంటర్వ్యూస్‌లో పాల్గొన్నప్పుడు కూడా ఇతగాడు క్రియేజ్ చేసే ఫన్ మాములుగా ఉండదు. అందరూ హీరోలు బ్రహ్మాజీని బాగా లైక్ చేస్తారు. తాజాగా ట్విట్టర్ వేదికగా హీరోలు నాగశౌర్య, రానా బ్రహ్మాజీని ఓ ఆట ఆడేసుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. నాగశౌర్య హీరోగా అనీష్ కృష్ణా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీలో నటుడు బ్రహ్మాజీ కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా శౌర్య-బ్రహ్మాజీలకు సంబంధించిన కొన్ని కామెడీ సీన్స్ షూట్ జరిగింది. షూట్ అనంతరం బ్రహ్మాజీ ముఖానికి నామాలు పెట్టుకుని.. అమాయకపు లుక్‌లో నాగశౌర్యతో ఫొటోకు పోజులిచ్చారు. ఈ ఫొటోని షేర్ చేసిన శౌర్య.. “నా తమ్ముడు బ్రహ్మాజీ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాడు. మీ అందరి సపోర్ట్ తనకి ఉండాలి. దయచేసి యంగ్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేయండి” అని సరదాగా ట్వీట్ చేశారు. దానికి సరదాగా స్పందించిన బ్రహ్మాజీ.. థ్యాంక్యూ అన్న.. యంగ్ టాలెంట్‌ని బాగా ఎంకరేజ్ చేస్తున్నావ్ అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు.
నాగశౌర్య, బ్రహ్మాజీ ట్వీట్లు…
కాగా, ఈ ట్వీట్‌పై శనివారం రానా స్పందించారు. “వామ్మో ఇదేంటి గురు!! నాగశౌర్య.. దయచేసి నువ్వు జాగ్రత్తగా ఉండు. బ్రహ్మాజీ చూపు నాకేంటో తేడాగా కనిపిస్తోంది. నువ్వు ఏమంటావ్?” అని రిప్లై ఇచ్చారు. దీనిపై శౌర్య స్పందిస్తూ.. “నువ్వు చెప్పింది కరెక్ట్ భయ్యా. నాకూ ఏదో తేడాగా అనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండాల్సిందే” అని అన్నారు. ఇలా వీరి మధ్య సరదాగా సంభాషణ సాగింది.
Also Read:సరుకులు తీసేందుకు ప్రిజ్ డోర్ తీశారు.. బుసలు కొడుతూ దూసుకొచ్చిన నల్లత్రాచు