Ramayana Movie: రాముడిని అలా చూపిస్తారా? ‘రామాయణ’ సినిమాపై జనజాగృతి సమితి తీవ్ర ఆగ్రహం.. పీఎస్‌లో ఫిర్యాదు

దీపావళి కానుకగా నవంబర్ 05న విడుదలైన రామాయణం ఇప్పటికే 1700 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ వీకెండ్ లో ఈ మూవీ రూ.2000 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే కలెక్షన్లతో పాటు ఈ మూవీని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి.

Ramayana Movie: రాముడిని అలా చూపిస్తారా? రామాయణ సినిమాపై జనజాగృతి సమితి తీవ్ర ఆగ్రహం.. పీఎస్‌లో ఫిర్యాదు
Ramayana Movie Controversy

Updated on: Nov 24, 2026 | 8:10 AM

రికార్డు కలెక్షన్లు సాధిస్తోన్న ‘రామాయణ’ సినిమాను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఈ సినిమా నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితీశ్ తివారీపై ములుండ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఈ సినిమాలో శ్రీరాముడిని కించపరిచి, రావణుడిని కీర్తించారంటూ హిందూ జనజాగృతి సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నమిత్ మల్హోత్రా, నితీశ్ తివారీలు వాల్మీకి రామాయణాన్ని వక్రీకరించి కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ వారు మండి పడ్డారు. ఈ మేరకు ములుండ్ (పశ్చిమ) పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారుజనజాగృతి సమితి ప్రతినిధి సతీశ్ కొచ్రేకర్. ఇందులో రావణుడిని పేదలకు బంగారు ఇళ్లు ఇచ్చే రక్షకుడిగా చూపించడంపై తీవ్ర అభ్యంతరం చేశారు. అలాగే రాక్షస సైన్యం ముందు రాముడు, లక్ష్మణుడు వెనుకంజ వేసినట్లు చిత్రీకరించారని విమర్శించారు. శూర్పణఖ విషయంలో సీతమ్మ లక్ష్మణుడిని మందలించినట్లు చూపిండాన్ని కూడా జనజాగృతి సమితి తీవ్రంగా తప్పు పట్టింది. అలాగే ఖర దూషణులను రాముడు క్షమాపణ కోరడం వంటి కల్పిత సన్నివేశాలు చేర్చారంటూ రామాయణ దర్శక నిర్మాతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు BNS సెక్షన్లు 299, 196 కింద FIR నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రామాయణ సినిమాపై నిపుణుల కమిటీతో సమీక్షించాలని, లేదంటే తీవ్ర ఆందోళన చేపడతామని జనజాగృతి సమితి హెచ్చరించింది. మరి దీనిపై రామాయణ దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరోవైపు ‘ రామాయణం ‘ బాక్సాఫీస్‌ వద్ద తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. 19 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్లు రూ. 1,704.65 కోట్ల మార్కును దాటాయి. ఇప్పటికే రికార్డు వసూళ్లతో దూసుకెళ్లతో ఈ మూవీ రూ. 2,000 కోట్ల మార్కును చేరుకోవడానికి మరో రూ. 295.35 కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంది. ఈ వీకెండ్ లోనే ఈ మూవీ రూ.2వేల కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. కాగా నమిత్ మల్హోత్రాకు చెందిన ‘ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్’, యష్‌కు చెందిన ‘మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్’, ‘డీఎన్ఈజీ’ సంస్థలు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రామాయణ సినిమాను నిర్మించాయి. నితేష్ తివారీ తెరకెక్కించినఈ సినిమాలో రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ కీలక పాత్రలు పోషించారు. అలాగే సన్నీ డియోల్, శోభన, కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, హరీశ్‌ ఉత్తమన్‌, ఫైసల్‌ మాలిక్‌, వివేక్‌ ఒబెరాయ్‌, కునాల్‌ కపూర్‌, ముకేశ్‌ తివారి, అనుపమ్ ఖేర్, సౌరబ్‌ సచ్‌దేవ్‌, రవి దూబే, ఆదినాథ్‌ కొఠారే, నితీశ్‌ శర్మ తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us